రాష్ట్రీయం

ఏడాదికి ఆరు సిలెండర్లు ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ఏడాదికి ఆరు వంట గ్యాస్ సిలెండర్లు (ఎల్‌పీజీ) ఉచితంగా అందించి ఆదుకుంటామని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం భారత్ బంద్ అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పెట్రోలు, డీజీలు, వంట గ్యాస్ ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 23 రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ధరలు అధికంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పక్క రాష్టమ్రైన కర్నాటకలో లీటరుకు రూ.2.60 పైసలు తక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలోకి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఏడాదికి ఆరు ఎల్‌పీజీ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజీలును జీఎస్‌టీ పరిథిలోకి తెస్తామని ఆయన వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలోకి రానున్నదని ఆయన ధీమాగా అన్నారు. కేంద్రానికి ఆదాయం తగ్గుతుందన్న భయంతో ప్రధాని మోదీ వీటిని జీఎస్‌టీ పరిథిలోకి తెవడం లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గినా, పెట్రోలు, డీజీలు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. దీనికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల వైఫల్యమని ఆయన విమర్శించారు.