తెలంగాణ

బర్రెలు, గొర్రెలు కాదు టిక్కెట్లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ‘బర్రెలు, గొర్రెలు కాదు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వండి..’ అని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూడరాదని, బీసీలకు రాజకీయ రంగంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం నాయకుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 86 బీసీ కుల సంఘాలు, 26 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేవారు. 71 సంవత్సరాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల్లో నాయకత్వం పెరిగిందని, సామాజిక, రాజకీయ చైతన్యం వచ్చిందని ఆయన తెలిపారు. ఇంకా దొరలకు ఓట్లేసి బానిసలుగా బతకరాదన్నారు. బీసీల కోసం పోరాడి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశామని ఆయన వివరించారు. ఇక మిగిలింది చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించేంత వరకూ విశ్రమించేది లేదని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయని కృష్ణయ్య విమర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ సంఘాల నాయకులు జనార్తన్, వేముల వెంకటేష్, కోట్ల శ్రీనివాస్, వేముల రాధాకృష్ణ, రామలింగం, బాల లక్ష్మీ, ముత్యాల హరికిషన్, రాజ్‌కుమార్, బద్ర, కోదండరాం, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.