స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సర్వసత్యానే్న వేదర్షి ‘కే పాయవః స నిషంత ద్యుమంతః’ ఆనందకరుడైన సంరక్షకుడు ఎవరిచేత సత్కృతుడవుతాడు అని నర్మగర్భంగా వివరించాడు. అంటె అందరిచేత సత్కృతుడే అని అంతరార్థం. ఈ వాక్యానే్న పునరాలోచన చేస్తే ‘కే పాయవః’ రక్షకుడెవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘స నిషంత ద్యుమంతః’ శక్తివంతుడే రక్షకుడై సత్కృతుడవుతాడు అన్న భావాన్ని కూడ గ్రహించవచ్చు. ఎప్పుడైనా భక్షకుని శక్తికంటె రక్షకుని శక్తియే అధికం. యజ్ఞదీక్ష తీసుకొనే సమయంలో యజమాని ‘ఇద మహ మనృతాత్సత్యముపైమి’ (శు.యజు.1-5) నేను అసత్యాన్ని విడిచి సత్యానే్న ఆశ్రయిస్తాను. ఇదే మానవులకు సర్వధా సర్వదా జీవిత ధ్యేయం. కాని అవిద్యవలన చాలమందికి అసత్యంమీదనే ఎంతో ప్రీతి కలుగుతుంది. లోకంలో మానవులకు చక్కని నడవడిక అలవడాలంటే ‘కే ధాసి మగ్నే అనృతస్య పాంతి’ ఎవడు అసత్యవాదిని రక్షిస్తాడు? అన్న ఈ వేద వచన ప్రబోధం బాగా తెలియవలసిన అవసరమెంతో ఉంది అని ప్రతిజ్ఞ చేస్తాడు.
ఇంతవరకు చెప్పబడిన అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఈ మంత్రంలో చేయబడిన చర్చ కేవలం లోకంలోని శత్రువులకు మిత్రులకు సంబంధించినది కాక ఒక గంభీర తాత్త్విక సత్యానికి సంబంధించినదని అర్థమవుతుంది. లౌకిక శత్రువులు మిత్రులుగా మారవచ్చు. మిత్రులు శత్రువులుగా కూడ మారిపోవచ్చు. ఇది అందరకు అనుభవంలో ఉండేదే. లోకంలోని శత్రుత్వ మిత్రత్వాలు సాధారణంగా ఏదో ప్రయోజనాన్ని అపేక్షించి మాత్రమే ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుత వేదమంత్రం ప్రస్తావిస్తున్నది లౌకిక శత్రుత్వ- మిత్రత్వాలకు సంబంధించినది కాదు. ఆత్మకు సంభవించే శత్రుత్వ మిత్రత్వాలను విశదపరస్తూ ఉంది.
పూర్వజన్మార్జిత విషయవాసనలు మరియు ఇహలోక ప్రలోభమూ ఆత్మను సమ్మోహనపరుస్తాయి. దానివలన ఆత్మకుగల సహజమైన మరియు నైమిత్తిక (సందర్భోచిత)మైన జ్ఞానాలు రెండూ హరింపబడతాయి. దానితో ఆత్మ తన సహజ స్ఫురణశక్తిని కోల్పోతుంది. ఏదో విధంగా అలా కోల్పోవకున్నా విషయ వాసన అనే అంధకారాన్ని కప్పి ఆత్మను నిష్క్రియాత్మకంగా చేస్తుంది. ఈ విధంగా విషయ వాసనలూ- ప్రలోభమూ కలిసి ఆత్మను అసత్యమైన జన్మసంసార సంరక్షణా లంపటురాలిగా చేస్తుంది. ఫలితంగా ఆత్మజన్మ- మరణ చక్రభ్రమణంలో చిక్కుకొనిపోతుంది. దానినుండి విముక్తిపొందాలంటే సత్యవ్యతిరేకులైన వారి చెడు సహవాసాన్ని విడిచి ‘క ఆసతో వచసః సంతి గోపాః’ ‘‘సత్య వచనానికి రక్షకులెవరు?’’ అని అనే్వషించి- వివేచించి వారితో సత్సంగం చేయాలి. ఈ శ్రుతి వచనానుసారం నడిచే వానిని శ్రుతిమాత తల్లివలె శుభప్రదాయినియై ఆత్మను లేదా జీవుణ్ణి అజ్ఞానాంధకారంలో పడనీయక అతని వ్రేలిని పట్టుకొని
యస్తే అగ్నే నమసా యజ్ఞమీట్ట ఋతం స పాత్యరుషస్య వృష్ణః...
॥ (ఋ.5-12-6)
ఓ జ్ఞాన స్వరూపా! సర్వార్థసాధక ప్రభో! నమస్కార పూర్వకంగా యజ్ఞాన్ని కాంక్షించి పూజించి అక్రోధనమూ- సుఖవర్ధకమూ అయిన ఋతాన్ని (సత్యాన్ని) ఎవడు రక్షిస్తాడో అంటే - పరమ ఆస్తికుడు- ఈశ్వరభక్తుడు ‘‘్భగవదాదిష్టమైన యజ్ఞాన్ని ఆచరిస్తాడో అతడే సత్యాన్ని సంరక్షించేవాడని దిశానిర్దేశం చేస్తుంది.
అట్టి సత్యసంరక్షకుని సత్సంగం స్వాత్మకల్యాణకారకం. కాబట్టి సత్యపాలకుని గుర్తించు. సత్య రక్షకుడే మిత్రుడు. అసత్య రక్షకుడు శత్రువు. శాంతి కాముకునకు వీరి వివేచనం అత్యావశ్యకం. ఇందుకే ఋగ్వేద మీవిషయానే్న
‘న వా ఉ సోమో వృజినం హినోతి’॥ ఋ.7-104-13॥
నిజమైన శాంతి కాముకుడు పాపకర్మ చేయడు అని ధృవపరచింది. ఇక్కడ ‘వృజినం’అంటె విడువ దగినది అని అర్థం. అలా విడువదగింది పాపమే. కాబట్టి పాపమంటె ఏమిటో స్పష్టమైన జ్ఞానం కలిగియుండాలి. అప్పుడే మానవుడు పాపకర్మను విడిచి సత్కర్మాచరణ తత్పరుడు కాగలడు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు