డైలీ సీరియల్

పచ్చబొట్టు-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శ్రీకాళహస్తి అంటే లోకప్రసిద్ధమైన శివక్షేత్రం. భారతదేశంలో ఉన్న శివక్షేత్రాలన్నింటిలో ఈ క్షేత్రాన్ని తలమానికంగా చెప్పుకుంటారు. పంచాభూత క్షేత్రాలలో ఇది వాయుక్షేత్రం. స్వయంభూమూర్తిగా, విరాట్ మూర్తిగా విలసిల్లుతున్నాడు. దీనినే దక్షిణ కైలాసమని, భాస్కర క్షేత్రమని కూడా అంటారు. అంతెందుకు తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్న వారందరూ తప్పక శ్రీకాళహస్తిలో శివుడుని దర్శించాలని కూడా అంటారు. తెలియనివాళ్ళు వెళ్ళిపోతారు కానీ తెలిసినవాళ్ళు ఎవరూ ఇక్కడకు రాకుండా వెళ్ళరు.’’
విద్య నానమ్మను చూస్తూ శ్రద్ధగా వింటోంది.
శివరాత్రప్పుడు తెప్పోత్సవం మన ఇంటిముందు ఉన్న కోనేరులోనే జరుపుతారు. ఈసారి మీరు ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని చూడవచ్చు.
‘‘నిజంగానా?’’ ఆశ్చర్యపోయింది విద్య.
అమ్మ బాగా గుడులకు వెళుతుంది. తన ధ్యాస అంతా చదువుమీదే! ఇంక దేనిమీద ఆశక్తి ఉండేదికాదు. అందుకే ఇవేమీ తెలియదు.
నది మీదుగా వస్తున్న గాలి చల్లగా స్పృశిస్తోంది వారిని.
తల్లి ఆశీర్వదిస్తున్నట్లే ఉంది.
చీకటిపడుతూ ఉంటే అది చలిగాలిగా మారుతుందని ‘‘ఇక వెళిపోదాం నానమ్మా!’’ అంది విద్య.
‘‘సరే పదండి! ఇక్కడ ఎంత సేపున్నా నాకు ఇంకా ఉండాలనే అనిపిస్తుంది. అంత ఎక్కువసేపు కూర్చోలేను కూడా!’’అనటంతో అందరూ బయటకు వచ్చేసారు.
కారులో కూర్చున్నాక ‘‘నానమ్మా! నీతో గుడికి రావటం మంచిదయింది. ఎన్నో విషయాలు తెలిసాయి. శ్రీకాళహస్తి అంటే సాలెపురుగు, పాము, ఏనుగు పూజించేవని, ఒకరితర్వాత ఒకరు శివుడ్ని అలా పూజిస్తూ ఉండేవని. అలాగే అవి చనిపోయాయని. అందువలనే ఈ ఊరికి ఆ మూడింటి పేర్లు కలిసి ‘శ్రీకాళహస్తి’అని పేరుపెట్టారని మాత్రమే తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమేగా!
‘‘నాకు మాత్రం అంత పెద్దగా ఏమీతెలియదు. ఆ స్వామి చరిత్ర ఎంతో గొప్పది. ఏదో నాకు తెలిసింది చెప్పాను.’’
‘‘నానమ్మా! నాకో సందేహం.’’
‘‘చెప్పు.’’
‘‘మనం దేమునికి నైవేద్యం పెట్టేప్పుడు రుచి చూడకూడదనుకుంటాంగా. మరి భక్తకన్నప్ప ప్రతీదీ రుచిచూసే శివునికి అర్పించాడుగా. ఆయన పేరుమోసిన భక్తుడయినప్పుడు మనం రుచి చూడకుండా చప్పగా పెట్టడం ఎందుకు?’’
‘‘నీకు భలే సందేహమొచ్చిందే విద్యా! రాముడికి కూడా శబరి కొరికి రుచి చూసి బాగుంటేనే పెట్టేది పళ్ళు ప్రసాదానికి. కన్నప్పలో అమాయకత్వానికి శివుడు మురిసిపోయాడు. శబరిలో భక్తికి సంతోషించాడు రాముడు. తిని పెట్టామా. తినకుండా పెట్టామా అన్నది కాదు ముఖ్యం. మనసు ఎంత భక్తిగా ఉంచుకుంటున్నాం అన్నదే ప్రధానం. మనసంతా భక్తితో నింపుకొని ఏదిపెట్టినా భగవంతుడు అందుకుంటాడు. ఎలా పెట్టినా స్వీకరిస్తాడు. మిగిలినవన్నీ మనం కల్పించుకున్నవే.’’
‘‘ఈరోజునుంచీ నేనుకూడా శివునికి పూజచేస్తాను’’ అంది విద్య.
‘‘నేను కూడా’’అన్నాడు వినీల్.
అందరి హృదయాలు భక్తితో నిండిపోయాయి.
‘‘అన్నయ్య కూడా వచ్చి ఉంటే బాగుండేది. వాడు ఏది చెప్పినా అది జరుగుతుందని నమ్మకం లేదు. సినిమాకి వస్తానని ఎన్నిసార్లు రాలేనని ఫోన్ చేసేవాడో! అమ్మ ఎప్పుడూ విసుక్కొనేది కాదు. పోనీలే. వాడికి డ్యూటీ ముందు. తర్వాతే ఈ సరదాలన్నీ అని. నాకు మాత్రం అది నిజమేననిపించినా ఒక్కోసారి విసుగేసేది వాడితో సినిమా చూడలేకపోతున్నానని.’’
‘‘అందుకే గదా వినీల్‌ని నీకప్పగించేసాడు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చు’’ అన్నారావిడ.
‘‘పో నాయినమ్మా!’’ అంది విద్య.
‘‘అన్నగారి గురించి అలా అంటోంది కానీ విద్య, ఈవిడకు ఫోన్ వస్తే సినిమా మధ్యలోంచి కూడా వెళ్ళిపోతుంది. కాదనగలదేమో అడుగు నాయనమ్మా’’ అన్నాడు వినీల్.
‘‘అన్నయ్యంత కాదన్నాను కానీ మాదీ అలాంటిదే. ఎప్పుడు ఏ గర్భిణీ స్ర్తికి నొప్పులు వస్తాయో మనకు తెలుస్తాయా ఏమిటి? తప్పదు. వెళ్ళాల్సిందే. అలా మనసు దానికి ఇష్టపడితేనే ఈ డాక్టరు వృత్తిని చేపట్టాలి. ఎవడెలాపోతే నాకెందుకులే అని నిద్రపోగలిగేవారు ఇందుకు అసలు పనికిరారు.’’
‘‘ఒప్పుకున్నాం’’అన్నాడు వినీల్ సడన్‌గా బ్రేక్ వేస్తూ.
తను ముందు దిగి నానమ్మను జాగ్రత్తగా దింపింది విద్య. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. వినీల్‌కి కారు తన సొంతమయినప్పటినుంచీ ఎంతో హాయిగా అనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. డిగ్రీ అవగానే ప్రభుత్వ ఉద్యోగాలుకోసం పరుగులెత్తి అవిరాలేదని నిరాశపడే వారిలో తను లేకుండా చూసుకోవటమే కాకుండా స్వయం ఉపాధి పథకాన్ని తనంతటతనే సృష్టించుకున్నాడు. అందులో తత్ఫలితాన్ని పొందాడు కూడా. ఇలాగే మరో కారు తీసుకొని ఎవరికైనా తిప్పటానికిస్తూ బ్యాంకులోను తీర్చవచ్చు. అలాఅలా అంచెలంచెలుగా పెరగవచ్చు. ఆరోజే తన పథకానికి రూపకల్పన చేసుకున్నాడు. జీవితాన ఎదగటానికి ఓ పట్టు సంపాదించుకున్నాడు. ఆ సంతోషం చాలు అనుకుంటూ కారుకి కవర్ కప్పాడు. హుషారుగా మెట్లెక్కిపైకి వెళ్ళాడు.
‘‘విద్యా! నానమ్మ గారేరి?’’ కనిపించటం లేదు?’’
‘‘కాసేపు పడుకుంటానంది. అలిసిపోయారుకదా. సరేనన్నాను. లోపల గదిలో నిద్రపోతున్నారు.
ఆ వయసలో అనవసరంగా తిప్పారేమో! రేపు సుఖబ్రహ్మాశ్రమంకి తీసుకువెళదామా? వద్దా?’’
‘‘తీసుకెళ్దాం. అడిగారుగా. అక్కడ మెట్లు ఎక్కాల్సినవి ఏమీ ఉండవు. ఉన్నా వాటిని మానిపించవచ్చు. ఈ వయసులో మెట్లు ఎక్కలేమని చెప్పేసి క్రిందనుంచీ ఓ దండంపెట్టి వదిలేస్తారు చాలామంది. నానమ్మే ఈ సాహసం చేసింది.’’
‘‘వంట చేసేస్తున్నాను. ఒక గంటలో భోంచేద్దాం’’ అంది విద్య.
‘‘అలాగే’’ అన్నాడు వినీల్.
పేరుకు గదులువేరయినా అన్నీ ఇక్కడే అని అనే్వష్, విద్య గట్టిగా చెప్పటంతో కాదనలేకపోయాడు. పెళ్ళయ్యాక ఎలాగూ అలాఅని అనుకున్నదేగా. అప్పటినుంచీ బియ్యం, పండ్లు, కూరగాయలు తనే బయటినుంచే తీసుకువస్తున్నాడు. వాళ్ళూ కాదనలేదు. అలా అందరూ సఖ్యంగా ఒక కుటుంబంలో వ్యక్తుల్లా నివసించాలన్నదేకదా వారి కోరిక కూడా!
‘‘అరగంటకే నానమ్మ బయటకు వచ్చేసింది ఏమర్రా ఏంచేస్తున్నారంటూ కుక్కర్ పెడదామా విద్యా అంది.’’
‘‘పెట్టేసాను నానమ్మా! ఇంక పది నిముషాలలో వంట రడీ.’’
‘‘నిద్ర బాగాపట్టేసింది. కాస్త నీకు సాయంచేసినా బాగుండేది.’
‘‘్భలే దానివి నానమ్మా! అరగంట కూడా నిద్రపోలేదు. అప్పుడే లేచి వచ్చేశావు. అంతా అయ్యాక నిద్రలేపుదామని నేననుకున్నాను.’’
‘్భలేదానివే. పగటి నిద్ర పనికి చేటు అని ఊరికే అన్నారా? ఎప్పుడయినా ఓ అరగంట నడుము వాలుస్తాను కానీ కునుకు మాత్రం తీయను.
‘‘నానమ్మా! నీ సిద్దాంతాలన్నీ చాలా బాగుంటాయి’’ అంది విద్య మనస్ఫూర్తిగా.
‘‘నానమ్మా! భోజనం వడ్డించనా. వంట రెడీ అయింది’’ అంది కాసేపయ్యాక విద్య. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206