నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.జుర్రెద మీ కథామృతము, జుర్రెద మీ పదకంజతోయమున్
జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుర్రెద జుర్రజుర్రఁగ రుచుల్ గనువారి పదంబుఁ గూర్పవే
తర్రులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథరామా, ఓ కరుణాసముద్రమా, నీ కథలు, నీ చరిత్రలు అమృతప్రాయమైనవి. ఆ అమృతాన్ని దోసిలితో గ్రహించి త్రాగుతాను. అనగా విని ఆనందిస్తాను. నీ పాద తీర్థాన్ని, నీ నామంలో స్రవిస్తున్న అమృతరసాన్ని జుర్రుతాను. నీ చరిత్రాదులను, నిన్ను గురించిన జ్ఞానాన్ని తెలిసికొన్న వారికి గల స్థానాన్ని నాకు కలిగింపుము. ఈ లోకంలో ఉండే నీచులతోడి సహవాసము నాకు కలిగింపకుము.

వ్యా: శ్రీరామునిపై భక్తి కలిగి మానవుడు ఏమి చేయవలెనో ఈ శతకకర్త పాఠకులకు బోధిస్తున్నాడు. శ్రీరాముని కథ సుదీర్ఘమైంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే ఆరు కాండల్లో విస్తరింపబడింది. ‘రామస్య అయనం ప్రాపయతీతి రామాయణమ్’ రాముని పదమునకు, అంటే ధామమునకు చేర్చేదే రామాయణం. పుట్టి, పెరిగి, పెళ్లి చేసుకొని, భార్యావియోగంలో దుఃఖించి తిరిగి భార్యను తెచ్చుకొన్న రాముని గొప్పతనం ఏమిటి? ఆయన ధామం ఏది? ఈ ఆలోచనతో శ్రీమద్రామాయణ కథాగ్రహణం చేస్తే శ్రీరాముడు శ్రీమన్మహావిష్ణువు, నిర్గుణ, నిర్వికార, నిరంజనమైన పరబ్రహ్మం. సకలప్రాణి హృదయాంతర్గత పరమాత్మయే రాముడు. మానవుల సాధన వ్యవస్థయే రామాయణం. రామాయణంలోని పాత్రలన్ని మానవునిలోని, సాధకునిలోని, విభిన్నమైన భావాలే. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు అనే బాహ్యాదృష్టితో ఈ పాత్రలను చూడనవసరం లేదు.