సబ్ ఫీచర్

అతుక్కుపోతే అవస్థలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిండీతిప్పలు, పనీపాటా లేకుండా రోజులో అధిక సమయాన్ని వీడియో గేమ్‌లతో గడిపేయడాన్ని మానసిక రుగత్మగా గుర్తించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహచ్‌ఓ) భావిస్తోంది. దైనందిన పనులను వదిలేసి వీడియో గేమ్‌లపైనే ఆసక్తి చూపడం, ఆ వ్యసనం వల్ల ఎదురయ్యే విపరిణామాలను గుర్తించకపోవడాన్ని నిపుణులు ‘గేమింగ్ డిజార్డర్’గా అభివర్ణిస్తున్నారు. ఈ డిజార్డర్‌ను ‘అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితా’లో చేర్చాలని డబ్ల్యుహెచ్‌ఓ యోచిస్తోంది. అమెరికాలో వీడియో గేమ్‌లపై గత ఏడాది సుమారు 1.9 బిలియన్ డాలర్లను వెచ్చించారని ఓ మార్కెటింగ్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. వీడియో గేమ్‌లు పిల్లల శారీరక, మానసిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిసినప్పటికీ తల్లిదండ్రులు నిస్సహాయంగానే ఉండిపోతున్నారని కూడా సర్వేలో గుర్తించారు. వీడియో గేమ్ కూడా ఓ రకమైన ఆటగా భావిస్తున్న విద్యార్థులు చదువులో వెనుకబడిపోవడమేగాక మరే ఇతర విషయాల్లోనూ రాణించలేకపోతున్నారు. ఉద్యోగులు కెరీర్ పరమైన నైపుణ్యాన్ని కోల్పోతున్నట్లు అధ్యయనంలో తేలింది.
కంప్యూటర్లు, వీడియో గేమ్‌లు, టీవీలతో కాలక్షేపం చేస్తే నేత్ర సంబంధ సమస్యలే కాదు.. మానసిక రుగ్మతలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలో ‘తెర’కు అతుక్కుపోవడం అనే అలవాటు అంచనాలకు మించి విస్తరిస్తోంది. కెరీర్ పరంగా అయితేనేం, వినోదం కోసం అయితేనేం ‘డిజిటల్ డివైజ్’ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారిలో 76 శాతం మంది అంటే- ప్రతి పదిమందిలో కనీసం ఏడుగురు నేత్ర సంబంధ సమస్యలతో సతమతమవుతున్నారని ఓ సర్వేలో తేలింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, వీడియో గేమ్‌ల వద్ద గంటల తరబడి కూర్చునేవాళ్లకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు.. కళ్లు తీవ్ర అలసటకు గురికావడం, ఎర్రబారడం, మంట పెట్టడం, పొడిబారిపోవడం, కళ్లచుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం, నిద్రలేమితో బాధపడడం వంటివి. కాలం గడిచే కొద్దీ కళ్లలో క్యాటరాక్ట్ పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఘోషిస్తున్నారు. ‘డిజిటల్ స్క్రీన్’కు అతుక్కుపోవడం తగ్గించకుంటే అంధత్వం అనివార్యమవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
వయోభేదం లేకుండా అన్ని వర్గాల వారూ డిజిటల్ స్క్రీన్‌కు అంటిపెట్టుకుని ఉండడం నేడు సర్వత్రా కనిపిస్తోంది. టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, ఈ-రీడర్స్.. ఇలా డివైజ్ ఏదైనా డిజిటల్ స్క్రీన్‌కు బానిసలు కావడాన్ని వైద్య నిపుణులు ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు. నిద్రపోయే సమయం కన్నా డిజిటల్ తెరపైనే ఎక్కువ సేపు గడుపుతున్నారని వివిధ దేశాల్లో ఇటీవల జరిగిన సర్వేలో వెల్లడైంది. విశ్వవ్యాప్తంగా 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజుకు సగటున 418 నిమిషాల సేపు డిజిటల్ తెరలకు అతుక్కుపోతున్నారట! రోజులో సుమారు 7 గంటల సేపు కంప్యూటర్‌తోనో, ల్యాప్‌టాప్‌తోనో, వీడియో గేమ్‌తోనో, టీవీతోనో కాలక్షేపం చేస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి 15 నుంచి 20 సార్లు కళ్లు మూసి తెరుస్తాడని, డిజిటల్ తెరను అలాగే చూడడం వల్ల కళ్లు మూయడం అన్నది బాగా తగ్గుతోంది. కళ్లను అదేపనిగా విప్పి ఉంచడం వల్ల అవి అలసటకు గురవుతూ పొడిబారుతున్నాయి. ఫలితంగా దృష్టి లోపం, కళ్ల మంటలు, దద్దుర్లు, తలనొప్పి వంటి సమస్యలు అనివార్యమవుతున్నాయి.
డిజిటల్ స్క్రీన్ నుంచి వెలువడే కిరణాలు కంటి రెటీనాను దెబ్బతీసే ప్రమాదం ఉంది. బ్యాక్లిట్, ఎమిట్ బ్లూ లైట్, హైఎనర్జీ విజుబుల్ లైట్ వేవ్‌లెంగ్త్‌లతో డిజిటల్ తెరలు ఉంటాయి గనుక కళ్లు పొడిబారడం, దగ్గర ఉన్న వస్తువులు చూడలేకపోవడం, కంటి నొప్పులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు హోమ్‌వర్క్ చేసేందుకు సైతం కొందరు విద్యార్థులు ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. తమకు కావాల్సిన సమాచారం కోసం విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నారు. విద్యపరంగా, కెరీర్ పరంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వినియోగం అధికమైంది.
‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ నుంచి బయటపడాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని అమెరికన్ వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. టీవీలకు 20 అడుగుల దూరంలో ఉండాలని, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడేవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా దృష్టిని పక్కకు మరల్చాలని, కంప్యూటర్‌లో దేన్నయినా 20 సెకన్లకు మించి చూడరాదని వారు అంటున్నారు. నిద్రకు ఉపక్రమించే వేళ కనీసం గంటముందయినా డిజిటల్ తెరకు దూరంగా ఉండాలి. డిజిటల్ స్క్రీన్‌కు అలవాటుపడిన వారు ‘బ్లూషీల్డ్ లెన్స్’లను వినియోగిస్తే కళ్లకు కొంతవరకూ రక్షణ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్ నుంచి వెలువడే హానికరమైన కిరణాల బారి నుంచి తప్పించుకునేందుకు మానిటర్ స్క్రీన్ గార్డ్‌లను వాడడం ఉత్తమం.