మల్టీస్టారర్‌లో రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు రామ్‌కు ఈమధ్య సరైన విజయాలు అందడంలేదు. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా తరువాత తాజాగా రామ్ మల్టీస్టారర్‌లో నటించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి ఆయన తమిళ హీరోతో కలిసి ఈ మల్టీస్టారర్ చేస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తమిళ హీరో ఎవరనేది ఇంకా తెలియాల్సి వుంది. స్రవంతి రవికిశోర్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.