నయన @ 1000కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా ఓ రేంజ్‌లో ఇమేజ్ సాధించుకున్న హీరోయిన్. ఆమెతో సినిమాలు చేసేందుకు ఇప్పటికీ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈమధ్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతున్న నయనతార, అటు కుర్ర హీరోలతోపాటు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ సరసన సైరాలో నటిస్తున్న ఈమె, తమిళంలో శంకర్-కమలహాసన్‌ల కలయికలో తెరకెక్కే భారతీయుడు-2 చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న నయనతార, ప్రస్తుతం మార్కెట్ పరంగా చూస్తే 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తూ సంచలనం రేపుతోంది. మెగాస్టార్ సైరా 200 కోట్లయితే, భారతీయుడు 500 కోట్లు, అజిత్‌తో 100 కోట్లు, అలాగే మరో సినిమా 200 కోట్లు.. ఇలా మొత్తంగా నయనతార నటిస్తున్న సినిమాలన్నీ కలిపి 1000కోట్లకుపైగా అని ట్రేడ్ విశే్లషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోయిన్ ఈ రేంజ్‌లో వరుస సినిమాలతో సంచలనం రేపడంలేదు.