బిజినెస్

రూపాయి పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 11: సమస్యల్లో చిక్కుకున్న రూపాయి మంగళవారం మరింత పతనమయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పడిపోయి, సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి 72.69 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తిరిగి ముడి చమురు ధరలు పెరగడం, మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో పాటు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రం కావడం రూపాయి పతనానికి దారితీశాయి. మంగళవారం రూపాయి మారకం విలువ సానుకూల ధోరణిలోనే ప్రారంభమయింది. ఉదయం లావాదేవీలలో డాలర్‌తో మారకం విలువ గరిష్ఠ స్థాయి 72.25ను తాకింది. అయితే తరువాత అకస్మాత్తుగా దిగజారి, ఇంట్రా-డేలో సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి 72.74కు పడిపోయింది. అయితే, వెంటనే రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యం చేసుకోవడంతో కొంత కోలుకుంది. వాణిజ్య యుద్ధ తీవ్రత పెరుగుతుండటం కూడా రూపాయి విలువ పతనానికి దారితీసింది. అయితే, రూపాయి మారకం విలువ పతనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఆసియా ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమయిన ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు ఉన్నాయి.

రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
* తీవ్రంగా నష్టపోయిన మదుపరులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో మదుపరులు భారీగా నష్టపోయారు. సోమ, మంగళవారాల్లో జరిగిన లావాదేవీలలో కలిసి రూ. 4.14 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయిపోయింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సోమవారం 467.65 పాయింట్లు పడిపోగా, మంగళవారం 509.04 పాయింట్లు దిగజారింది. రెండు రోజుల్లో కలిసి బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 4,14,121.84 కోట్లు పడిపోయి, రూ. 1,53,25,666 కోట్లకు చేరింది. రూపాయి మారకం విలువ పడిపోవడమే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణమని విశే్లషకులు పేర్కొన్నారు.