బిజినెస్

ప్రభుత్వ విధానాలతో పెద్ద కంపెనీలకు గడ్డుపరిస్థితి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 11: ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలు, సైబర్ సెక్యూరిటీలో తరచూ తలెత్తుతున్న అవరోధాలు, లోపాల వల్ల వచ్చే మూడేళ్లలో దేశంలోని దాదాపు 100కి పైగా పెద్ద కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నాయి. ఈ విషయమై ఆయా కంపెనీల అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సుదీర్ఘంగా జరిపిన సర్వే ఆధారంగా ‘డెలాయిట్ ఇండియా రిస్క్ సర్వే 2018’ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఈ సర్వే ప్రకారం మన దేశంలోని ప్రభుత్వ విధానాలు, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఎదురవుతున్న అవాంతరాలు, ఇబ్బందులు రానున్న మూడేళ్ల కాలంలో పెద్దపెద్ద కంపెనీలతోపాటు 44 శాతం వరకు వ్యాపార కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. సైబర్ సెక్యూరిటీలో లోపం కారణంగా 31 శాతం, టెక్నాలజీలో తలెత్తే సమస్యలతో 25 శాతం ఆయా కంపెనీలు సతమతమయ్యే అవకాశం ఉంది. ఇప్పటినుంచి రానున్న మూడేళ్ల కాలంలో ఈ గడ్డు పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దేశంలోని వందకు పైగా వివిధ అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు, చీఫ్ రిస్క్ ఆఫీసర్లు, బిజినెస్ లీడర్లు, వాటి అధిపతులతో అభిప్రాయం ప్రకారం అంతర్గతంగా నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం వెల్లడైనట్టు ఆ నివేదికలో స్పష్టం చేశారు. డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోనే సాంకేతికపరంగా ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బయటపడే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వయిజర్ రోహిత్ మహాజన్ తెలిపారు. రిస్క్ వల్ల ఒడిదుడుకులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని, రిస్క్‌ను ఎదుర్కొనేందుకు ఆయా సంస్థలు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.