సబ్ ఫీచర్

మన ప్రజాస్వామ్యం.. మేడిపండు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజకీయ యవనికపై తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ఘట్టం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల ప్రజా పోరాటం ఫలితంగా, ముఖ్యంగా మలిదశ ఉద్యమం పదునాలుగు సంవత్సరాల పాటు కొనసాగి పరాకాష్ఠకు చేరడంతో నాలుగేళ్ల క్రితం నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ పోరాటంలో అనె్నం పునె్నం తెలియని ఎంతోమంది యువకులు, విద్యార్థులు ఆత్మత్యాగాలు చేశారు. ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు ఉద్యమం కోసం తమ ఆస్తిపాస్తులను సైతం ధారపోసి పోరాటంలో మేము సైతం అంటూ వీరోచితంగా పాల్గొన్నారు. మొత్తం మీద నూతన తెలంగాణ రాష్ట్రానికి 2014 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతృత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పడింది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఇంకా 10 నెలల సమయం వున్నప్పటికీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా అర్ధాంతరంగా అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. సహజంగా ఉత్తమ రాజకీయవేత్త ఎవరైనా భవిష్యత్తు తరాల గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. మామూలు రాజకీయనేత మాత్రం కేవలం అధికారం గురించి, తన వ్యక్తిగత ఆధిపత్యం గురించి తపిస్తాడు. నేటి రాజకీయ నేతలు, నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మామూలుగా ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగిన నాయకులకు పూర్తిగా కాకపోయినా సగానికి సగమైనా సేవాభావం, అంకితభావం వుంటాయి. ఆ స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు మాటిచ్చినట్లుగా ‘బంగారు తెలంగాణ’ ఆశయ సాధనలో కొంతమేరకైనా సఫలీకృతులవుతారని యావత్ తెలంగాణ ప్రజలు ఆశించారు. అయితే- కేసీఆర్ కూడా అందరిలాగే వ్యవహరించడమేగాక, ఏదో ఉపద్రవం వచ్చినట్లు అసెంబ్లీని ఆకస్మికంగా రద్దుచేయడం సమంజసమేనా? ఈ నిర్ణయంతో తాను కూడా మామూలు రాజకీయ నాయకుడినేనని కేసీఆర్ నిరూపించుకున్నారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు, మతకలహాలు వం టివి ఏర్పడినప్పుడు, ప్రక్క దేశాలనుంచి దాడులు ప్రారంభమై యుద్ధమేఘాలు ఆవరించినప్పుడు, భయంకరమైన భూ కంపం, కనీవినీ ఎరుగని వరదలు వంటి ప్రకృతి విలయతాండవ పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యా న్ని కొన్ని అసాంఘిక శక్తులు అపహాస్యం చేస్తున్నప్పుడు కేం ద్ర ప్రభుత్వం తనకున్న విచక్షణాధికారంతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం లేదా ఆ యా పాలకులు పరిస్థితులను బట్టి అసెంబ్లీ, పార్లమెంటులను రద్దుచేయడం జరుతుంటుంది. నేడు తెలంగాణలో పైన పేర్కొ న్న ప్రతికూల పరిస్థితులు ఏవీ ముంచుకురాలేదు. 2019లో లోక్‌సభ ఎన్నికలతోపాటు తె లంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగివుంటే సరాసరిన ప్రజాధనం 200కోట్లు ఆదా అయ్యేది. తన ప్రభుత్వానికి ఇప్పుడు అనుకూల వాతావరణం వున్నందున ప్రత్యర్థులు పుంజుకోకుండానే అసెంబ్లీ ఎన్నికలకు వెళితే సునాయాసంగా మరోమారు గెలిచి ఆ తరువాత ఐదేళ్లు యథేచ్ఛగా పాలన సాగించవచ్చుననే రాజకీయ కో ణంలో కేసీఆర్ శాసనసభను రద్దు చేయించారు. ప్రజల శ్రేయస్సును, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని కేసీఆర్ ఆవిధంగా ఆలోచించలేదనే విమర్శలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు తనకు ఇష్టం లేని కాంగ్రెస్సేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్క కలంపోటుతో రద్దుచేసేవారు. ఆమెకు వచ్చిపడిన కొన్ని న్యాయపరమైన, రాజకీయపరమైన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రజల నెత్తిన పెద్ద బండ వేసినట్లుగా 1975లో ఎమర్జెన్సీని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడంతో- ఆ వ్యతిరేక పవనాలతో 1977లో ఆపె ప్రజాతీర్పుకు అనుగుణంగా ఓడిపోయారు. అప్పట్లో ఇందిరాగాంధీని ఎదురులేని వీరవనితగా, ఉక్కు మనిషిగా కీర్తించినవారే, ఆ తర్వాత ఆమెను నియంతగా విమర్శించారు. సుమారు 25 సంవత్సరాల తరువాత భారత రాజకీయాలలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, పటిష్ఠమైన నాయకుడు నరేంద్ర మోదీ దేశానికి అవసరమయ్యాడని, ఆయనను మరో ఉక్కుమనిషిగా ఆమధ్య అందరూ కీర్తించారు. అయితే, మోదీ పాలనలో కూడా కొన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇప్పుడు భారతదేశంలో మోదీ ఇండియా, మోదీ బీజేపీ, మోదీ పార్లమెంట్ ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య విలువలకు తగ్గట్టుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వం నడవడం లేదని రాజకీయ విశే్లషకులు, సామాజిక మేధావులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా ఆయన కుమారుడు లోకేష్, ఎమ్మెల్యేగా వియ్యంకుడు బాలకృష్ణ ప్రభుత్వంలో కొనసాగుతుండగా అనేక కుటుంబాలలో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొన్నది. వైకాపా గురించి వేరే చెప్పవలసిన పనిలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే బదులు ‘కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ అంటే బాగుంటుందని ప్రత్యర్థులు ఎత్తిచూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే గాక, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీల్లో, జాతీయ పార్టీల్లో కొన్ని కుటుంబాల పెత్తనం కొనసాగుతోందన్నది కాదనలేని వాస్తవం. ప్రజాస్వామ్యం కనుమరుగై ధనస్వామ్యం, కుటుంబ స్వామ్యం, వ్యక్తిస్వామ్యం కొనసాగుతూనే వుంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212