కృష్ణ

మట్టి విగ్రహాలనే పూజిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్) : మట్టితో తయారు చేసిన గణనాధులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని కృష్ణా విశ్వవిద్యాలయం ఎంఎస్‌సీ రసాయన శాస్త్ర విభాగం విద్యార్థులు పిలుపునిచ్చారు. రసాయన శాస్త్ర విభాగం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విశ్వవిద్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల తయారీపై ఒక రోజు కార్యశాల నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొని మట్టి వినాయకుని విగ్రహాలను తయారు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్సిటీ ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు పర్యావరణ పరిరక్షణ కాంక్షిస్తూ ముందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పులిపాటి కింగ్, జెఎన్‌టీయు కాకినాడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుబ్బారావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా. డి రామశేఖరరెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూదార్ నమోదుకు సహకరించాలి

బంటుమిల్లి, సెప్టెంబర్ 11: గ్రామ పంచాయతీ వారు నిర్వహిస్తున్న భూధార్ నమోదు కార్యక్రమానికి ఆయా గృహ యజమానులు సహకరించాలని మచిలీపట్నం డివిజినల్ పంచాయతీరాజ్ అధికారి జె సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల పంచాయతీ కార్యదర్శులు, బుక్ కీపర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ లోపు సాధ్యమైనంత తొందరగా ఇంటి యజమానులతో భూధార్ కార్డులు అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటున్నారని హెచ్చరించారు. విధిగా ఇంటి యజమానులు తమ ఇంటి హక్కు పత్రాల నకళ్లను సిబ్బందికి ఇచ్చి సహకరించాలని కోరారు. ఇఓపీఆర్‌డీ ఎండీ రజాఉల్లా, పంచాయతీ కార్యదర్శులు దాసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.