కృష్ణ

విషజ్వరంతో వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: మండలంలోని వెల్లటూరులో విషజ్వరం సోకి మందా దీనమ్మ (39) అనే గృహిణి సోమవారం రాత్రి మరణించింది. అదే గ్రామంలో ఆర్‌ఎంపి వైద్యుని వద్ద ఈమె శనివారమే ప్రాథమిక చికిత్స చేయించుకుంది. కానీ ఆదివారం ఉదయం నుంచే ఈమెకు విరోచనాలు ప్రారంభమయ్యాయి. వెంటనే మైలవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్ళగా అక్కడ కూడా డాక్టరు అందుబాటులో లేని కారణంగా విరేచనాలు అనుకుని సెలైన్లు పెట్టి, విరేచనాల నియంత్రణకు సంబంధించిన మందులు ఇచ్చారు. సోమవారం ఉదయం డాక్టరు వచ్చి దీనమ్మను పరిశీలించి తమ వల్లకాదని విజయవాడ గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పారు. దీనిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దీనమ్మను మైలవరంలోనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ రక్తపరీక్షలు చేసి, ఇందులో డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని, విజయవాడ పెద్దాసుపత్రికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. అదే రోజు 108కి ఫోన్ చేస్తే ఒకరు బిజీగా ఉన్నామని చెప్పగా, మరొక 108 సర్వీసు వాళ్ళు ఇంధనం అయిపోయిందని చెప్పారు. విజయవాడలోని ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రికి ఎలాగోలా బాధితురాలిని తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోయాయని చెప్పి, రూ.10వేలు చెల్లిస్తేనే ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తామని తెలిపారు. సొమ్ము చెల్లించిన తరువాత చికిత్స పొందుతూ సోమవారం రాత్రి దీనమ్మ మృత్యువాత పడింది.
పాములలంక హైలెవెల్ బ్రిడ్జికి
రూ.30 కోట్లతో టెండర్

*బ్రిడ్జి నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 11: మండలంలోని తోట్లవల్లూరు - పాములలంక గ్రామాల మధ్య కృష్ణానదీపాయపై రూ.30 కోట్లతో 342 మీటర్ల పొడవుగల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని పంచాయతీరాజ్ (ప్రాజెక్ట్స్ వింగ్) ఈఈ శ్రీనివాసులు చెప్పారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సిన ప్రదేశాన్ని మంగళవారం మాజీ సర్పంచ్ పాముల శ్రీనివాసరావుతో కలిసి ఈఈ శ్రీనివాసులు, డీఈఈ రామాంజనేయులు, ఏఈఈ వెంకన్న పరిశీలించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే డివై దాస్ రూ.13.5 కోట్లతో శంకుస్థాపన చేసిన తర్వాత అధికారులు వంతెన నిర్మాణానికి వేసిన రాళ్లను, స్థలాన్ని మాజీ సర్పంచ్ అధికారులకు చూపించారు. విద్యుత్ టవర్ ప్రక్కగా ప్లాన్ వేశారని శ్రీనివాసరావు తెలిపారు. పాయ మధ్యలో గౌడ ఫీల్డు సొసైటీ భూముల నుంచి వంతెనకు ప్లాన్ వేశారన్నారు. దీంతో సదరు అధికారులు ఆ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కృషితో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరవగా టెండర్ పిలిచామన్నారు. ఈ టెండర్‌ని వల్లభనేని కనస్ట్రక్షన్ దక్కించుకుందని, ఇక నిర్మాణ పనులు చేపట్టటమే తరువాయి అన్నారు. ఈ లోపు తాము గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తామని తెలిపారు. రూ.30 కోట్లతో హైలెవల్ బ్రిడ్జితో పాటు ఫీల్డు సొసైటీ అవతల రూ.4కోట్లతో కాజ్‌వే కూడా నిర్మిస్తామని చెప్పారు. ఎంత వరదలు వచ్చినా లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్లాన్ వేశామన్నారు.