కృష్ణ

ట్రిపుల్ ఐటీలో గడ్డి కరుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకొన్నాయి. విద్యావిధానం లోపభూయిష్టంగా ఉంటే, విద్యార్ధులకు అందించే వివిధ రకాల సౌకర్యాలలో కూడా అధికారుల ‘డొల్లతనం’ బట్టబయలు అవుతోంది. ట్రిపుల్ ఐటీలో ప్రణాళికబద్దమైన నిర్ణయాలు మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా ఔషద మొక్కల పెంపకం కేంద్రం పనితీరు పరిశీలిస్తే ట్రిపుల్ ఐటీ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. విద్యార్ధులు, సిబ్బంది నగదు అవసరాల కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో భారతీయ స్టేట్ బ్యాంకు హైదరబాదు శాఖను ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసిన సమయంలో ఔషధ మొక్కల పెంపకానికి శ్రీకారం చుడితే మంచి ఫలితాలు వస్తాయని భావించిన నాటి అధికారులు ఈ కేంద్రానికి నాలుగు ఏకరాల భూమిని కేటాయించారు. దీనిలో ఔషధ మొక్కల పెంపకానికి అప్పటి ఎస్‌బిహెచ్ పది లక్షల రూపాయలను విరాళంగా అందజేసింది. నాటి నుండి నేటి వరకు ఒక్క ఔషధ మొక్కను కూడా ట్రిపుల్ ఐటీ అధికారులు పెంచలేదు. ఔషధ మొక్కల పెంపకానికి ఎస్‌బిహెచ్ అందజేసిన పది లక్షల రూపాయలు ఆవిరయనట్టు కనిపిస్తోంది. ఈ భూమిని ఖాళీగా ఉంచేయడం ఎందుకని భావించిన ఇక్కడ పనిచేసే ఉద్యోగి ఒకరు ‘పశుగ్రాసం’ పండించుకుంటున్నారు. సదరు గడ్డితో ఆయన పాడిపరిశ్రమ ‘మూడు లీటర్లు... ఆరు కాసులు’గా విరాజిల్లుతోంది. అంతేకాకుండా ‘ట్రిపుల్ ఐటీ గడ్డితో కురిసే పాడిని ఇక్కడి ‘మెస్’కే పోసి ‘మార్కెటింగ్’ ఇబ్బంది కూడా లేకుండా చేసుకుంటున్నారు. సందు దొరికింది కదా అని సదరు ఉద్యోగి ఇక్కడే ‘బినామీ’గా ‘కాంట్రాక్టు పనులు’ కూడా చేసుకుంటూ రెండు చేతులా... కాదు కాదు నాలుగు చేతులా ‘నాలుగు రాళ్లు’ వెనకేసుకుంటున్నారు. ‘గడ్డి’ వ్యవహారంపై డైరెక్టర్ వీరంకి వెంకటదాసును వివరణ కోరగా ఈ విషయం ఇటీవలే తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై ఉద్యోగికి నోటీసు ఇచ్చామని చెప్పుకొచ్చారు. విశ్వవిద్యాలయం నియమ నిబంధనల ప్రకారం గడ్డిపెంచటం నేరమని అన్నారు. ఇదిలా ఉండగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న షాపుల నిర్వహణలో కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ అధికారులు అనుమతి ఇచ్చిన ఆహార, ఇతర వస్తువులను మాత్రమే విక్రయంచాల్సి ఉండగా వారికి నచ్చిన.., ‘నాలుగు రాళ్లు’ ఎక్కువ మిగిలే వాటిని విక్రయస్తూ మనకు ‘అడ్డేం ఉందన్నట్టు’ వ్యాపారం సాగిస్తున్నారు. ఇది అధికారులకు తెలియకుండా జరగడం లేదు... ఇటీవలే సంబంధిత దుకాణాలను ట్రిపుల్ ఐటీ అధికారులు పరిశీలించి, అనుమతి లేని వస్తువులు విక్రయిస్తున్నారంటూ నోటీలు ఇచ్చి ‘తమ పని అయపోయందని’ చేతులు దులుపుకున్నారు. ‘అవినీతి పుట్ట’లా మారిన నూజివీడు ‘ట్రిపుల్ ఐటీ’పై ఉన్నత స్థాయ విచారణ చేపట్టి ‘వాసి’ తగ్గకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.