రాష్ట్రీయం

సరికొత్త పని సంస్కృతిని తీసుకొచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: యువత ఆశయాలకు అనుగుణంగా సరికొత్త పని సంస్కృతిని పాదుకొలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మరోవైపుప్రత్యేక చర్యలు సాగుతున్నాయన్నారు. స్వామి వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయ, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో దేశం పురోగమిస్తోందన్నారు. స్వామి వివేకానందుని చారిత్రాత్మక చికాగో ప్రసంగాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూర్‌లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన 125వ సంస్మరణోత్సవాల ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం ప్రధాని వీడియో అనుసంధానంగా ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైనా యువత విద్యారంగంలో పురోగమిసున్నప్పటికీ ఉద్యోగాలకు సరిపడా ప్రావీణ్యతను సంతరించుకోలేకపోతోందని మోదీ అన్నారు. అందుకే యువతలో సరికొత్త పని సంస్కృతిని నెలకొల్పేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను సైతం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే యువత కలల సాకారానికి వారు తమ కాళ్లపై నిలబడేందుకు సహకరించేలా బ్యాంకులను సైతం సన్నద్ధం చేశామన్నారు, స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఏర్పాటు చేసిన ముద్రా పథకం ద్వారా 13 కోట్లకు పైగా రుణాలు ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్టార్టప్ ఇండియాను ఉద్యమంలా చేపట్టి యువతలో కొత్తకొత్త ఆలోచనా విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. గత యేడాది ఎనిమిది వేల స్టార్టప్ కేంద్రాలకు ప్రభుత్వ గుర్తింపును ఇచ్చామన్నారు. అలాగే పాఠశాలల్లో సైతం పరిశోధనాత్మక దృక్పథాన్ని నెలకొల్పే కృషి జరుగుతోందని ఇందుకోసం ఐదు వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను రాబోయే ఐదేళ్లలో నెలకొల్పనున్నామని ఆయన వివరించారు. మన దేశానికి యోగ, ఆయుర్వేద వంటి ప్రాచీన విశిష్ట సంస్కృతులున్నాయని తద్వారా ఆరోగ్య, ఐశ్వర్యవంతమైన దేశంగా ప్రగతి సాధించే అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు. ఒకేసారి వంద ఉపగ్రహాలను రూపొందించే స్థితికి మనదేశం చేరిందని, మంగళ్‌యాన్, గంగాయాన్ వంటి ప్రాజెక్టుల గురించి ప్రపంచ దేశాలన్నీ చర్చించుకుంటున్నాయన్నారు, భీమ్ వంటి మనదేశ యాప్‌లను ఇతర దేశాలు సైతం వినియోగించుకుంటున్నాయన్నారు. పేద, అట్టడుగు, బలహీన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాని మోదీ పేర్కొన్నారు. పేదరికం విజయాలకు అడ్డుకాదని ఇటీవలి ఆసియా గేమ్స్‌లో మన క్రీడాకారులు చాటిచెప్పారన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో జరుగుతున్న వ్యవసాయోత్పతులు రైతుల్లో సైతం ఆత్మ విశ్వాసం పెంచిందని మోదీ తెలిపారు.