అంతర్జాతీయం

నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి: పర్యావరణ మార్పుల ప్రతికూల పరిణామాలపై ఐక్యరాజ్య సమితి మరోసారి తీవ్రస్వరంతో హెచ్చరించింది. ఇదేతరహాలో వాతావరణ మార్పులు కొనసాగితే విపత్తుల కూపంలో జారుకున్నట్టే అవుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేరళలో సంభవించిన ప్రకృతి బీభత్సాన్ని, దానివల్ల సంభవించిన అపార ఆస్తి, ప్రాణనష్టాలను కూడా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా ఉటంకించారు. పర్యావరణ మార్పులను నిరోధించే విషయంలో తక్షణ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం అనివార్యమని ఉద్ఘాటించారు. గత ఏడాది ప్యూటోరికోలో సంభవించిన హరికేన్ వల్ల మూడు వేల మంది మరణించడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పర్యావరణ మార్పులను నిరోధించే దిశగా ప్రస్తుత ప్రపంచం ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్న ఆయన దీనిని నిర్ణయాత్మక కాలంగా అభివర్ణించారు. ఈ విషయంలో ఏమాత్రం ఉదాసీనత వహించినా పెనుముప్పును కొనితెచ్చుకున్నట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు. ‘పర్యావరణ మార్పు’ అంశంపై సోమవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులను ఎదుర్కోవడానికి పర్యావరణ విపత్తుల నివారణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు మనకు దీని ఆవశ్యకతను తెలియజేస్తోందన్నారు. అధిక వేడిగాలులు, కార్చిచ్చు, తుపానులు, వరదలు ప్రపంచవ్యాప్తంగా మానవుడికి సవాల్ విసురుతున్నాయని అన్నారు. గత నెలలో కేరళ రాష్ట్రంలో జరిగిన వరదల వల్ల 400 మంది మృతి చెందారని, దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఆయన చెప్పారు.
ఈ ఏడాది మే ఐదున పర్యావరణ మార్పులకు సంబంధించి జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి మనం శీఘ్రంగా స్పందించాలన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని, వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 1850 నుంచి నుంచి ఇప్పటివరకు 18 అతి ఉష్ణోగ్రత సంవత్సరాలు నమోదయ్యాయని, అందులో ఈ ఏడాది నాలుగో అతివేడి సంవత్సరంగా నమోదైనట్టు ఆయన చెప్పారు.