రాష్ట్రీయం

నిజాం మ్యూజియం దొంగలు దొరికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: నిజాం మ్యూజియంలో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలు పోలీసులకు దొరికిపోయారు. అత్యంత విలువైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1936) కాలం నాటి వస్తువులు దోపిడీకి గురయ్యాయి. నవాబ్ పాలన రజతోత్సవం సందర్భంగా విదేశీయుల నుంచి బహుమతులుగా వచ్చిన వస్తువులను పురానా హవేలీ వద్ద నిజాం మ్యూజియంలో ఉంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వస్తువుల విలువ వందల కోట్లు రూపాయలు ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. టిఫిన్ బాక్సు, టీ కప్పు, సాసర్‌లు దొంగిలించారు. వజ్రాలు, బంగారంతోవాటిని పొదిగినట్టు ఆయన చెప్పారు. చోరీ తరువాత ముంబయి పారిపోయిన నిందితులు ఓ స్టార్ హోటల్‌లో బస చేశారన్నారు. ముంబయికి వెళ్లక ముందు దొంగలించిన టిఫిన్ బాక్స్‌లో ఒకపూట భోజనం చేయడంతోపాటు టీ కప్పులో చాయ్ తాగి ఆనందించారని ఆయన చెప్పారు. నిందితుల వివరాలను సీపీ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. మహమ్మద్ గౌస్ బాష (23) మహమ్మద్ ముబీన్ (24) చిన్ననాటి స్నేహితులు, ఒకడు సెంట్రింగ్ వర్కర్. మరొకడు వెల్డింగ్ వర్కర్. దోపిడీకి 40 రోజుల ముందే వారు రెక్కీ నిర్వహించారని ఆయన వెల్లడించారు. మ్యూజియంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని 30 రోజుల ఒకసారి మారుస్తారన్న విషయాన్ని దొంగలు ముందే పసిగట్టినట్లు ఆయన చెప్పారు. రెక్కీ దృశ్యాలు గుర్తించే అవకాశం లేనందున సెప్టెంబర్ 3 తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వ్యవధిలో పని ముగించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని సీపీ తెలిపారు. 5 గంటలకు నమాజ్ ఉంటుందని భావించి అంతకు ముందే పని పూర్తిచేసుకుని బయటపడినట్లు విచారణలో తేలిందన్నారు. చివరికి ఖురాన్ సైతం దొంగలించడానికి ప్రయతించారు. అప్పటికే రోడ్లపై జన సంచారం మొదలుకావడంతో దొరికిపోతామన్న కంగారులో బయటపడ్డారని ఆయన అన్నారు. అక్కడి నుంచి ఎవరికీ అనుమానం కలగకుండా అటూ ఇటూ తిరిగి ద్విచక్ర వాహనంపై పారిపోయారని చెప్పారు. దొంగిలించిన వస్తువులను తొలుత రాజేందర్‌నగర్ డైరీ ఫాం సమీపంలో గుంతతవ్వి అందులో పూడ్చిపెట్టి జహీరాబాద్‌కు వెళ్లిపోయారు. తరువాత ముంబయి వెళ్ళారు. అక్కడ అంతర్జాతీయ కొనుగోలుదార్లకోసం ఖరీదైన హాటళ్లలో బసచేశారు. అయితే కొనుగోలుదారులు దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వస్తువుల కోసం పూడ్చిపెట్టిన చోటుకు ఇరువురు చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సౌత్‌జోన్ పోలీసులు, నేర విభాగానికి చెందిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. నిందితులను పట్టుకోవడానికి 20 పోలీసు బృందాలు పని చేశాయని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితులు ఇద్దరిపైనా గతంలో 15 నుంచి 20 కేసులున్నాయని ఆయన చెప్పారు.