రంగారెడ్డి

గ్యాస్ సిలిండర్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, సెప్టెంబర్ 11: లబ్ధిదారులకు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. మంగళవారం కేశంపేట మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద టీఆర్‌ఎస్ సీనియర్ నేత లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లను అందజేశారు. లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు జమాల్‌ఖాన్, ఎంపీటీసీ చంద్రయ్య, మాజీ సర్పంచ్ చంద్రయ్యతో పాల్గొన్నారు.
పాత తాండూరులో పట్నం సుడిగాలి పర్యటన
తాండూరు, సెప్టెంబర్ 11: పట్టణంలోని పాత తాండూరులో అపద్దర్మ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మంగళవారం సుడిగాలి పర్యటన సాగించారు. అపద్దర్మ మంత్రి పలు కార్యక్రమాలకు విరివిగా నిధులు మంజూరు చేశారు. పాత తాండూరులో డ్వాక్రా భవనం నిర్మాణానికి మొదటి విడతగా రూ.10లక్షలు మంజూరు చేశారు. మంత్రి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొ నేందుకు బయ లు దేరుతుండగా కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో ఆర్‌టీసీ బస్సు ప్రమాదం ఘటన సమాచారం అందటంతో హుటాహూటిన తాండూరు నుంచి బయలు దేరివెళ్లారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్‌టీసీ బస్సు ఘోర ప్రమాదం పట్ల ఆపద్దర్మ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని విస్మయాన్ని వ్యక్తం చేశారు.
కంటి వెలుగుకు అనూహ్య స్పందన
ఆమనగల్లు, సెప్టెంబర్ 11: మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లబిస్తుంది. మంగళవారం రాంనుంతల గ్రామ పంచాయతి పరిధిలోని రాంనుంతల పెద్దతాండ కంటివెలుగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు శ్రీకాంత్, సూపర్ వైజర్ శ్రీనివాస్ మాజి సర్పంచ్ ఆనంద్ పాల్గొన్నారు.
జోనల్ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
హయత్‌నగర్, సెప్టెంబర్ 11: 64వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సరూర్‌నగర్ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలకు తుర్కయంజాల్ మనె్నగూడలోని శ్లోకా ఇంటర్‌నేషనల్ స్కూల్‌లో విద్యార్థుల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా గేమ్స్ సెక్రెటరీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రారంభమయ్యే పోటీలకు మంగళవారం జగదీశ్వర్ రెడ్డి, శ్లోకా విద్యాసంస్థల చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి, హయత్‌నగర్ ఎంఈవో హిర్యా నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణ పనులు పూర్తి
ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మాగణపతి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. మంగళవారం మహాగణపతికి శిల్పి రాజేంద్రన్ కళ్లను అద్దారు. ఈ సంవత్సరం సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా ఖైరతాబాద్ గణేషుడు దర్శనమివ్వనున్నాడు. ఏడు తలల వెనుక ఏడు సర్పాలను ఏర్పాటు చేశారు. స్వామికి ఇరువైపులా లక్ష్మిదేవి, సరస్వతి దేవీలను ఏర్పాటు చేశారు. జూన్ మొదటి వారంలో ప్రారంభమయిన గణనాధుడి విగ్రహ నిర్మాణ పనులు మంగళవారంతో పూర్తి అయ్యాయి.