రాష్ట్రీయం

కేసీఆర్‌ను తప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును తప్పించి రాష్టప్రతి పాలన విధించాలని ప్రతిపక్షాల నాయకులు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. మంగళవారం టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పి మాజీ నేత కే. జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగవని అన్నారు. అందుకే తాము కేసీఆర్‌ను తప్పించి రాష్టప్రతి పాలన కోసం కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఓటర్ల జాబితా సిద్ధం అవుతుంటే ముందస్తు ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ను కూడా కేసీఆర్ ప్రభావితం చేశారా? అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. కేసీఆర్ ఎన్నికల షెడ్యూలును ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. 2004లో దొంగ పాస్ పోర్టులో కేసులో ఉన్నది నిజం కాదా? అని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. తమ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేందుకే జగ్గారెడ్డిపై కేసు పెట్టారని ఉత్తమ్ విమర్శించారు.
రాష్టప్రతికీ ఫిర్యాదు చేస్తాం..
రమణ మాట్లాడుతూ ఐదేళ్ళు పాలన చేసేందుకు ప్రజలు ఓట్లు వేస్తే కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని విమర్శించారు. త్వరలో రాష్టప్రతిని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో చట్టాలకు పాతరేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వాపును చూసి బలం అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కేసీఆర్ దొడ్డిదారిన అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.