రంగారెడ్డి

పింఛన్ డబ్బులు ఇవ్వండి సారూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, సెప్టెంబర్ 11: పింఛన్ డబ్బులు ఇప్పించండి సారూ..అంటూ వృద్ధులు అధికారులను వేడుకుంటున్నారు.
మంగళవారం కేశంపేట మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో పింఛన్ డబ్బులు రాక వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళనకు దిగారు. పింఛన్ డబ్బులు ఒకే రోజు ఇచ్చి బంద్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పింఛన్ డబ్బులు సకాలంలో ఇవ్వకుంటే తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వృద్ధులు వాపోయారు. మంగళవారం నిర్ధవెల్లి గ్రామ తపాల కార్యాలయం ఎదుట వృద్ధులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 5న ప్రభుత్వం నుంచి వచ్చిన పింఛన్ డబ్బులు బీపీఎంల చేతికి ఇచ్చారు. 6, 7, 8వ తేదీల్లో కుల్వకుర్తిలో ఆర్‌ఐసీ ట్రైనింగ్ ఉందని బీపీఎంలను పిలిపించడంతో పింఛన్లు కాస్తా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 9వ తేది ఆదివారం కావడం..10వ తేది సోమవారం ఒక్కరోజు పింఛన్ డబ్బులు పంపిణీ చేశామని, 11వ తేదిన ఆన్‌లైన్ బంద్ కావడంతో పంపిణీ చేసేందుకు వీలు లేకుండా పోయిందని బీపీఎంలు తెలిపారు. ఏమి చేయాలో తెలియక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పింఛన్ డబ్బులు పంపిణీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించి నేడు ఆన్‌లైన్ బంద్ చేశారని, వచ్చే నెలలో డబ్బులు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కేశంపేట ఎంపీడీవో పద్మజను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించిన ఆన్‌లైన్ బంద్ కావడంతో పంపిణీ చేసేందుకు అంతరాయం నెలకొందని అన్నారు. వచ్చే నెలలో రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులు ఒకేసారి చెల్లిస్తామని, ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
పింఛన్ల పంపిణీకి గడువు పొడగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని తెలిపారు.
కూకట్‌పల్లి టికెట్ హరీష్ రెడ్డికి ఇవ్వాలని దీక్ష
కేపీహెచ్‌బీకాలనీ, సెప్టెంబర్ 11: కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ అసమ్మతి సెగ మొదలైంది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్ మాధవరం కృష్ణారావుకు ఇవ్వోద్దని హరీష్ రెడ్డికి ఇవ్వాలని మంగళవారం బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరీష్‌రెడ్డి కేపీహెచ్‌బీకాలనీ టెంపుల్‌బస్టాప్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. మాధవరం కృష్ణారావుపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అధిష్టానం దృష్టిలో పెట్టుకుని హరీష్‌కు టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలి
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 11: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి గెలుపొందింది కేసీఆర్ బొమ్మతోనే కానీ మరే ఇతర కారణం కాదని రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ముకీద్ చందా, సరికొండ వెంకటేష్, గుమ్మడి కుమార్, రాజేష్, రాపోలు సత్తయ్య, తెప్ప అరుణ, పాశం మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో అధిష్ఠానం నిర్ణయానికే పని చేయాలని, తమ ఇష్టానుసారం రాష్ట్ర స్థాయి నాయకులను దూషించడం సరైంది కాదన్నారు. కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన ఆందోళన విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరుతామని వెల్లడించారు.
కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 11: ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో పార్టీల్లోకి చేరికలు ఊపందుకున్నాయి. మంగళవారం మెట్లకుంట పంచాయతి పరిధిలోని దీప్లానాయక్ తండా, బుర్రితండా, బోజన్నగడ్డ తండాతో పాటు బొంరాస్‌పేట మండల కేంద్రానికి చెందిన యువకులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చందర్ నాయక్, రాము, రాజు, పాండ్య నాయక్, నర్సింహా, రవి, గోపాల్, హరిచందర్ ఉన్నారు.