జాతీయ వార్తలు

‘ఉపాధి హామీ’లో రాష్ట్రానికి 7 అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జాతీయ స్ధాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు తెలంగాణ రాష్ట్రానికి ఏడు అవార్డులు లభించాయి. కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో మెరుగైన ఫలితాలు సాధించిన వారికి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అవార్డులను ప్రదానం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం కేటాగిరిలో ప్రదానం చేసిన మూడు అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం లభించగా, ఈ అవార్డులను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ఆ శాఖ అధికారి బి.సైదులు అందుకున్నారు. సుపరిపాల కార్యక్రమాల విభాగంలో ద్వితీయ స్థానం లభించింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ అమలులో అత్యుత్తమ పురస్కారం లభించింది. ఈ అవార్డు నీతూ ప్రసాద్, ఉన్నత అధికారి ఎస్‌జే ఆశలు అందుకున్నారు. ఉపాధి హామీ అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాల విభాగంలో 18 అవార్డులను గ్రామీణభివృద్ధి శాఖ ప్రదానం చేయగా అందులో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఈ అవార్డులను వికారాబాద్ జిల్లా నుంచి అధికారులు సయ్యద్ ఒమర్ జలీల్, పిడబ్ల్యూ జాన్సన్ అందుకున్నారు. కామారెడ్డి జిల్లా తరపున కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అధికారి చంద్రమోహన్‌రెడ్డి అందుకున్నారు. వాటితోపాటు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఐఆర్‌డి) జిల్లాల్లో సమర్థవంతంగా పనిచేసి శిక్షణ అమలు చేసినందుకుగాను అవార్డు లభించగా దీన్ని ఎస్‌ఐఆర్‌డి కమిషనర్ పౌసుమీ బసు అందుకున్నారు. ఉపాధి హామీ అమలులో ఉత్తమ గ్రామ పంచాయతీగా సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీకి లభించింది. ఈ అవార్డును ఆ గ్రామ పంచాయతీ అధికారులు ఆర్.రాజు, ఎ జీవన్‌రెడ్డి, సమ్మిరెడ్డి అందుకున్నారు. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో నగదు చెల్లింపులు చేసిన విభాగంలో 18 అవార్డులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రదానం చేయగా, మెదక్ జిల్లా శంకరంపేటకు చెందిన శాప మానయ్య అవార్డును అందుకున్నారు.