రాష్ట్రీయం

జగ్గారెడ్డికి 15 రోజుల కస్టడీ బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కుటుంబ సభ్యుల పేర్లు మార్చి పాస్‌పోర్టు పొందడంతోపాటు, తప్పుడు వీసాపై అమెరికా వెళ్లారన్న ఆరోపణలపై అరెస్టయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది. సికిందరాబాద్ కోర్టు 15 రోజుల కస్టడీ విధించింది. 2004లో సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా జగ్గారెడ్డిపై 9 సెక్షన్లు కేసులు నమోదు చేశామని నార్త్‌జోన్ పోలీసులు వెల్లడించారు. మారుపేర్లతో పాస్‌పోర్టు దక్కించుకోవడంతో వారిని అమెరికాకు తీసుకువెళ్లి అక్కడ వదిలి వచ్చారని వారన్నారు. మారుపేర్లుగా భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కొడుకు భరత్‌సాయిరెడ్డిలకు పాస్‌పోర్టులు మంజారు చేయించారు. అమెరికా కన్సల్టెంట్, చెన్నై పాస్‌పోర్టులకు ఎమ్మెల్యే లెటర్‌హెడ్లను పంపించారు. పాస్‌పోస్టలు ఇప్పించినందుకు రూ. 15 లక్షల రూపాయలు దళారి మధుకు ఇచ్చినట్టు అభియోగం. జెట్టి కుసుమకుమార్ వ్యక్తుల అక్రమ రవాణాకు సహకరించినట్లు పోలీసులు చెప్పారు. అరెస్టు అనంతరం జగ్గారెడ్డిని సికింద్రాబాద్ కోర్టుకు హాజరుపరిచారు. బెయిల్ కోసం జగ్గారెడ్డి చేసుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆయనను 15 రోజుల రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేసిందని మార్కెట్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అంజయ్య తెలిపారు.