హైదరాబాద్

ధూం..్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మండప నిర్వాహకులు తమవంతు విరాళాలను పోగు చేసి, ఇతరుల వద్ద కూడా చందా వసూలు చేసేవారు. కానీ సారి మండప నిర్వాహకులకు ఆ ఇబ్బందులు తగ్గేలా ఉన్నాయి. ముందస్తు ఎన్నికల పుణ్యమాని ఇప్పటికే నగరంలో వేడెక్కిన రాజకీయంగా కారణంగా మండపాల వారీగా విరాళాలిచ్చేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, పార్టీల టికెట్లను ఆశిస్తున్న ఆశావాహులు తామంతట తామే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. దీంతో గతంలో కన్నా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు మరింత ధూం ధాంగా జరిగే అవకాశాలున్నాయి. ముఖ్య విషయమేమిటంటే స్థానిక ప్రజాప్రతినిధిని కలిసేందుకు ఎన్ని సార్లు ఇంటికి, ఆఫీసుకు వెళ్లిన అందుబాటులో ఉండని నేతలు, ఇపుడు బస్తీలు, కాలనీల వారీగా సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల ప్రతినిధులను పిలిచి, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేయాలని, అందుకు ఏమైనా సహాయం కావాలంటే చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఇప్పటికే టికెట్లు ఖరారైన వారు తమ నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీల్లో ఏర్పాటయ్యే వినాయక మండపాల వివరాలను తెప్పించుకుంటున్నారు. వాటిలో కొన్నింటికి వినాయకుడి విగ్రహాన్ని విరాళంగా ఇచ్చేందుకు మండప నిర్వాహకులను ఒప్పిస్తున్నారు. మరికొందరు వినాయక నవరాత్రులు, నిమజ్జనంతో కలిపి మొత్తం పదకొండు రోజుల పాటు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాల ఖర్చులను భరించేందుకు ముందుకొస్తున్నట్లు పలువురు మండప నిర్వాహకులు తెలిపారు. చవితి ఉత్సవాలు జరిగే పదకొండు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఇప్పటికే టికెట్ ఖరారైన నేతలు మండపాల వివరాలతో ప్రత్యేక షెడ్యూల్‌ను కూడా తయారు చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఇచ్చే రాజకీయ నాయకులే మండప ముస్తాబు ఖర్చులు కూడా భరిస్తున్నారు. నగరంలో ఇప్పటికే పలు పర్యాయాలు గెలిచి, ఉన్నత పదవుల్లో కొనసాగిన కొందరు సీనియర్ రాజకీయ నేతలు తమ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, కాలనీలకు ఇచ్చేందుకు ఏకంగా 50 నుంచి వంద వరకు ఐదు నుంచి పది, పదిహేను అడుగుల ఎత్తు కల్గిన వినాయక విగ్రహాల తయారీ కోసం దూల్‌పేటలోని కళాకారులకు ఆర్డర్ ఇచ్చి మరీ చేయించారు. దశల వారీగా ఆ విగ్రహాలు మండపాలకు తరలుతున్నాయి. ముఖ్యంగా నేతలు ఒక బస్తీలో, కాలనీలో తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల సంఖ్యను చూసుకుని ఎంత వరకు విరాళం ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయించుకుంటున్నారు. నగరంలోని పలు నియోజకవర్గాలకు వివిధ పార్టీలకు చెంది ఇప్పటికే టికెట్లు ఖరారైన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా వినాయక చవితి నుంచే ప్రారంభిస్తే కలిసొస్తుందని భావించి, అదే రోజు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.