హైదరాబాద్

విద్యుత్ శాఖలో ఎవరిదారి వారిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జంట నగరాలు, శివారు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలతో అల్లాడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సామాన్యులు సతమతమవుతుంటే అధికారులు మాత్రం తమకు నచ్చితే కోట్లాది రూపాయల పనులను అనుభవం లేని, అర్హతలేని కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రోడ్లపై నాటిన దశాబ్దాల కాలంనాటి విద్యుత్ స్తంబాలను తొలగించాలనో లేక వేలాడుతున్న తీగలను సరిచేయమనో, సింగిల్ ఫేస్‌లను త్రీఫేస్ చేయమనో విజ్ఞప్తులు చేస్తే వాటికి ఎస్టిమేట్‌లు వేయాలని, దానికి కావాల్సిన వ్యయాన్ని స్వయంగా కాలనీవాళ్లో, బాధితులే భరించాలంటూ ఆక్షేపణలు చెపుతున్న క్షేత్రస్థాయి అధికారులకు సరైన సూచనలను ఇవ్వాల్సిన యాజమాన్యం మాత్రం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఏమాత్రం స్పందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఒక చిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయాలంటే సవాలక్ష నిబంధనలతో ముందుకెళ్తున్న టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ మాత్రం భారీ స్థాయిలో నిర్మించే సబ్‌స్టేషన్ల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు ఉన్న అర్హతలను ఏమాత్రం పరిధిలోకి తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాలో పనులు చేయకూడదన్న నిబంధనను పెట్టుకుని చాలామందిని తిరస్కరించిన సందర్భాలున్నాయి. అలాంటి కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో అన్ని లైసెన్స్‌లను పొందిన తర్వాతే వారికి పనులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ నిబంధన ఎక్కడి రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం లైసెన్సులను పొంది అర్హతలను ఆధారంగా టెండర్లలో పాల్గొనే విధానానికి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ఎస్‌పిసిపిడిసిఎల్ యాజమాన్యం స్వస్తిపలికినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రిజిస్టేషన్ లేకుండానే అర్హతలేని కాంట్రాక్టర్లకు సుమారు రెండుకోట్ల సబ్‌స్టేషన్ నిర్మాణపు పనులను కేటాయించారన్న ఆరోపణపై తెలంగాణ లోని విద్యుత్ శాఖలో పనిచేసే కాంట్రాక్టర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక అధికారి చేస్తున్న తప్పిదాలను యాజమాన్యం కప్పిపుచ్చుతోందని సాధారణ పనులను చేసే ఒక కాంట్రాక్టరుకు ఏకంగా రెండుకోట్ల విలువైన ఇండోర్ సబ్‌స్టేషన్ పనులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేసారని, దానిలో 20 శాతం తక్కువ కోడ్ చేస్తే నాణ్యతగల పనులు ఎలా చేస్తారని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి లైసెన్స్‌ను పొందలేదని, సదరు కాంట్రాక్టర్‌కు ఈపీఎఫ్, జీఎస్టీ, ఇఎస్‌ఐ, లేబర్, లైసెన్సులు లేవని ఆరోపిస్తున్న తెలంగాణ కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులను నిలదీసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాస్టర్ ప్లాన్ విభాగంలో కొనసాగతున్న టెండర్ల బాగోతంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడో, రేపో మేనేజింగ్ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధపడుతున్నారు. కేవలం ఆంధ్రా ప్రాంతంలో పనులను చేసేందుకు కావాల్సిన అనుభవాలను పొందడానికే ఇక్కడ పనిచేస్తున్నారని, అలాంటి వారికి పనులను అప్పగిస్తే నాణ్యత లోపించి ప్రజాధనం దుర్వినియోగం కావడంతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు.