హైదరాబాద్

భారీ వర్షం.. అప్రమత్తమైన బల్దియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో మరోసారి అకస్మికంగా భారీ వర్షం కురిసింది. రెండురోజులుగా ఉదయం పది, పదకొండు గంటల నుంచి ఎండ కొడుతూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం కూడా పగటి పూట ఎండ మండిపోయి, సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సుమారు 45 నిమషాల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలోని పలు రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని సౌత్ జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్‌లో అతి ఎక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో వర్షం కురిసే అవకాశముందని, ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తుగా అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు, రోడ్డు ఇన్‌స్టెంట్ రిపేర్ టీంలతో పాటు జలమండలి అత్యవసర బృందాలను కమిషనర్ దాన కిషోర్ అప్రమత్తం చేశారు. రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశమున్నందున క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు 384 వర్షాకాల ప్రత్యేక ఎమర్జెన్సీ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్డుపై భారీగా నిలిచిన వర్షపు నీటిని తోడేయటంలో నిమగ్నమయ్యాయి. వర్షం ప్రారంభం కాగానే జీహెచ్‌ఎంసీలోని కమాండ్ కంట్రోల్ రూం, బుద్ద్భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూంల ద్వారా ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఎక్కడెక్కడ వర్షపు నీరు బాగా నిలిచిందన్న విషయాన్ని గమనించి, అక్కడకు ఎమర్జెన్సీ బృందాలను పంపించి నీటిని తొలగించే పనులు చేపట్టారు. సాయంత్రం ఆరు గంటల వరకు పాతబస్తీ సర్దార్ మహాల్‌లో అత్యధికంగా 66.8మీ.మీ., అత్యల్పంగా 0.3మీ.మీ.లు బొల్లారంలో వర్షపాతం నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
మ్యాన్‌హోల్స్ మూతలు తెరవకూడదు
నగరంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరంలోని వివిధ ప్రాంతాల్లోని మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ సూచించారు. జలమండలి అధికారులు అన్ని మ్యాన్‌హోల్స్ మూతలు పటిష్టంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికపుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రధాన రహదార్లలోని మ్యాన్‌హోల్స్ మూతలు తెరవకుండా స్థానిక జలమండలి మేనేజర్లు ఎప్పటికపుడు పర్యవేక్షించాలని సూచించారు. మ్యాన్‌హోల్స్‌కు సంబంధించిన ఫిర్యాదులుంటే ప్రజలు 155313కి అందించాలని, వర్షాలతో రోడ్లు జలమమయం కావటం, ఇతర ఫిర్యాదుల కోసం డయల్ 100, కాల్ సెంటర్ నెంబర్ 040-21111111 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.