తెలంగాణ

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం, డేయిలీ వేజేస్, ఎన్‌ఎంఆర్ తదితర తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ముందస్తు ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టొ)లో హామీ ఇచ్చిన పార్టీలకే ఓట్లు వేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ ఈ ఉద్యోగులు 20 నుంచి 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. తమ సర్వీసులు ఎప్పటికైనా రెగ్యులరైజ్ కాకుండా పోతుందా అనే ఆశతో వారంతా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. పొరుగు రాష్టమ్రైన కర్నాటకలో లక్షా 70 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగిందని ఆయన ఉదహరించారు. అదేవిధంగా తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, ఒరిస్సా రాష్ట్రాల్లోనూ తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగిందన్నారు. తమ డిమాండ్ పూర్తిగా న్యాయమైందని కృష్ణయ్య అన్నారు.