తెలంగాణ

కాలేయ మార్పిడి సర్జరీలో యశోద హాస్పిటల్స్ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సల్లో యశోద హాస్పిటల్స్ గ్రూపు మరో ముందడుగు వేసింది. నార్మోథర్మిక్ పర్ప్యూషన్ టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ తొలిసారిగా తెలుగు రాష్టాల్లో ఉపయోగించింది. ఈ పరికరాన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో వరుసగా మూడు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సల్లో ఉపయోగించారు. తాజాగా ఆ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ బాలచంద్రన్ మీనన్ నేతృత్వంలో ఈ వినూత్న శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఎల్‌ఎఫ్‌టి, అల్ట్రాసౌండ్ పరీయలు, శస్త్ర చికిత్సకు ముందు కాలేయం కనిపించిన దానిని మట్టి కేడావరిక్ (బ్రెయిన్ డెడ్ పేషంటు నుంచి సేకరించిన) కాలేయ మార్పి సర్జరీలు చేస్తున్నారు. దీని వల్ల చాలా వరకు కెడావరిక్ కాలేయాలను నిరుపయోగమైనవిగా భావించి తిరస్కరిస్తున్నారు. వాటిని పునరుద్ధరించే ప్రయత్నమూ జరగడం లేదు. నార్మోథర్మిక్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ యంత్రంతో దాత నుంచి సేకరించిన కాలేయపు యథార్థస్థితి, నాణ్యతను నిర్థారించుకోగలుగుతాం. యశోద గ్రూపు ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న రోగులకు ఈ అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త జీవితం లభ్యం కానున్నదని అన్నారు. డాక్టర్ మీనన్ మాట్లాడుతూ ఈ ఏర్పాటు దాతల నుంచి సేకరించిన కాలేయాలలో అవయవమార్పిడి కోసం అందుబాటులోకి వచ్చే వాటి సంఖ్యను పెంచడమే కాకుండా శస్త్ర చికిత్స తర్వాత స్వీకర్తలు కోలుకోవడాన్ని కూడా గణనీయంగా పెంచగలమని తెలిపారు.