తెలంగాణ

పితాని బాలకృష్ణకు జనసేన తొలి టికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలోని ముందస్తు ఎన్నికలపై విస్తృతమైన చర్చలు జరపుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులనూ సమీక్షిస్తున్నారు. మంగళవారం నాడు తనను కలవడానికి వచ్చిన నేతలతో మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ మాజీ సమన్వయ కర్త పితాని బాలకృష్ణకు ఆంధ్రాలో తొలి టిక్కెట్‌ను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జనసేన ఏ మతానికో, కులానికో, ప్రాంతానికో చెందిన పార్టీ కాదని అన్నారు. పితాని బాలకృష్ణ వంటి కమిట్‌మెంట్ ఉన్న నేతల కోసం నిరీక్షిస్తున్నందునే పార్టీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. పితాని బాలకృష్ణతో పాటు అత్తిలి సీతారామస్వామి, జి జమ్మి, పాలెపు ధర్మారావు, మచ్చా నాగబాబు తదితరులు పార్టీలో చేరారు. వీరితో పాటు 500 మంది అనుచరులు కూడా జనసేనలో చేరారు. వీరికి పవన్‌కళ్యాణ్ జనసేన కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ జనసేన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పితాని పేరును ప్రకటించారు.
తెలంగాణ పరిస్థితిపై చర్చ
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హోరు ప్రారంభం కావడంతో పవన్‌కళ్యాణ్ తెలంగాణలో పలు జిల్లాల నుండి వచ్చిన నేతలతో సమీక్ష నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు, పార్టీ పరిస్థితి, పార్టీని బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు.