తెలంగాణ

మార్పు కోసం బీజేపీ శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ముందస్తు ఎన్నికల్లో మహాకూటమికి, అధికార టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ ఈ నెల 11వ తేదీన మార్పు కోసం బీజేపీ శంఖారావం పేరిట మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసభను నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నాయకులు ఈ సభలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. మొత్తం 50కి పైగా సభలను నిర్వహిస్తామని , ఈ సభలకు ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొంటారని అన్నారు. గడప గడపకు బీజేపీ ఇంటింటికీ మోదీ , అజేయ భారత్- అటల్ భాజపా అనే నినాదాలతో ప్రజల వద్దకు వెళ్తాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఇపుడు చంద్రబాబునాయుడు అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా చేస్తున్నారని అన్నారు. ఇది చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పారు. ఉద్యమం సమయంలో రెండుకళ్ల సిద్ధాంతం అన్న చంద్రబాబునాయుడు ఇపుడు రెండు నాల్కల ధోరణితో అవలంభిస్తున్నారని అన్నారు. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధికి అడ్డం తగులుతూ , తెలంగాణ వ్యతిరేక చర్యలు చేపడుతూ ఇపుడు తెలంగాణకు టీడీపీ చారిత్రక అవసరం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారం కోసం, ఓటు బ్యాంకు కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు చేతులు కలపడాన్ని ప్రజలు ఆమోదించబోరని చెప్పారు. రాష్ట్రంలో ఇంత వరకూ అన్ని పార్టీలకూ ప్రజలు అధికారం ఇచ్చారని, నీతి నిజాయితీలకు మారుపేరైన బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్ ప్రజలను కోరారు.