రాష్ట్రీయం

జనవరిలో ‘ముందస్తు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: జనవరిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో మంగళవారం విశాఖలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన జగన్ ముందస్తు ఎన్నికలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పాదయాత్ర ఓపక్క కొనసాగుతున్నా, మరోపక్క పార్టీ శ్రేణులు జనం మధ్యకు వెళ్లాలని ఆదేశించారు. ఈ నెల 17 నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా సమన్వకర్త బూత్ స్థాయి కమిటీలను సమన్వయపరుచుకుని వారిని ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు. ‘జగన్ రావాలి-జగన్ కావాలి’ అన్న నినాదంతో బూత్ స్థాయి కమిటీ సభ్యులతో కలిసి సమన్వయ కర్తలు, లేదా పార్టీ ఎమ్మెల్యేలు ఆ బూత్‌ల పరిధిలో ఉన్న ప్రతి గడపగడపకూ వెళ్లాలని జగన్ సూచించారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రాంతీయ పరిస్థితులను జనాలకు వివరించాలి. అలాగే వైసీపీ లక్ష్యాలు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల గురించి జనానికి విడమరిచి చెప్పాలని జగన్ సూచించారు. అలాగే పార్టీ రూపొందించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. జనాన్ని కలిసినప్పుడు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే, ఏపీకి ప్రత్యేక హోదా, రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ఇంటికొక ఉద్యోగం, పేదలకు గృహాలు, మహిళా భద్రతలో ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించాలని జగన్ సూచించారు. గ్రామ, పట్టణ, నగరాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. దీనివలన చంద్రబాబు ప్రలోభాలను చాలా వరకూ అడ్డుకోగలుతామన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు. పాదయాత్ర ద్వారా వచ్చిన ప్రజా స్పందనను అదే స్థాయిలో కొనసాగించే బాధ్యత ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలపై ఉందని జగన్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త నెల రోజుల్లో 50 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని జనాన్ని కలవాలని లక్ష్యాన్ని జగన్ నిర్దేశించారు.
ఇదిలా ఉండగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లను ప్రభుత్వం కావాలని తొలగించిందని ఇప్పటికే, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని జగన్ చెప్పారు. వచ్చే నెల 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితా సవరణకు సమయం ఉన్నందువలన పోయిన వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తిరిగి చేర్పించే బాధ్యత ఆయా నియోజకవర్గ బాధ్యులు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఎన్నికల సమీపిస్తున్నందువలన ఈ ప్రకియ చాలా కీలకమని అన్నారు. బూత్ స్థాయి కమిటీలు లేనిచోట వాటిని వెంటనే నియమించాలని, ఈ నియామకంలో నియోజకవర్గ స్థాయిలో ఏదైనా సమస్యలు ఎదురైతే పార్టీ కేంద్ర కమిటీయే నేరుగా కమిటీని నియమిస్తుందని జగన్ చెప్పారు.
జిల్లాలో పక్షపాత ధోరణితో వ్యవరిస్తున్న అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ వారిలో మార్పురాకపోతే, న్యాయ పోరాటానికి సిద్ధపడాలని చెప్పారు.
ఈ సందర్భంగా వైసీపీ రూపొందించిన ‘నవరత్నాలు’ పోస్టర్‌ను జగన్ ఆవిష్కరించారు.
విశాఖలో 260వ రోజు పాదయాత్ర
ఇదిలా ఉండగా ప్రజా సంకల్పయాత్ర భాగంగా జగన్ 260వ రోజు పాదయాత్ర మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో చినవాల్తేరు శిబిరం నుంచి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఈస్ట్‌పాయింట్ కాలనీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. మార్గ మధ్యంలో ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఇచ్చిన వినతిపత్రాలను జగన్ స్వీకరించారు.