తెలంగాణ

కొండగట్టు ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 11: కొడిమ్యాల మండలం శనివారం పేట నుంచి కొండగట్టుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడి ఇందులో ప్రయాణిస్తున్న 50మంది మరణించగా మరో 32 మందికి తీవ్రగాయాలు కాగా క్షతగాత్రులకు జిల్లాలోని వివిధ ఆసుపత్రులతోపాటు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఘోర రోడ్డు ప్రమాదాన్ని నేరంగా పరిగణించాలని, కేవలం ఆర్టీసీ లాభాపేక్ష ధోరణే ఘోర ప్రమాదం జరిగిందని, నిబంధనలు ఉల్లంఘించి ఘాట్ రోడ్డులో బస్సు నడిపించడంపై అధికారులే బాధ్యత వహించాలన్నారు. అధికార తప్పిదంతో ప్రమాదం జరగ్గా గ్రామస్థులపై నెపం నెట్టడం సరికాదని పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఆర్టీసీ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మేరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టిన బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. జీవన్‌రెడ్డి వెంట కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కట్కం మృత్యుంజయం, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బండ శంకర్, చొప్పదండి సత్యం తదితరులున్నారు.

చిత్రం..వివరాలు తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి