జాతీయ వార్తలు

అఫ్గాన్‌లో మానవ బాంబు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలాలబాద్, సెప్టెంబర్ 11: అఫ్గానిస్తాన్‌లో నిరసనకారులపై జరిగిన మానవబాంబు దాడిలో 25 మంది మృతి చెందారు. మరోచోట జరిగిన పేలుళ్లలో 57 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలతో ఆ దేశంలో ఎన్నికలు, శాంతిచర్చలపై ఆశలు సన్నగిల్లాయి. అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై మానవ బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో 25 మంది మృతి చెందారు. అలాగే నంగర్తర్ ప్రాంతంలో హైవేని మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశంలో బాంబుపేలుళ్లు సంభవించడంతో 57 మంది గాయపడ్డారని, ఆ దేశ అధికార ప్రతినిధి ఇనాముల్లా మియాకిల్ తెలిపారు. గాయపడిన వారిని జలాలాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించినట్టు ఆయన చెప్పారు. అయితే ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదని, తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుల కార్యకలాపాలను నంగహర్‌లో ఎక్కువగా ఉండటం వల్లే వారే దీనికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌లో వరుస హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు సంఘటనలు జరగడానికి కొన్ని గంటల ముందే రెండు బాంబు పేలుళ్లుసంభవించాయి. మొదటి బాంబు జలాలబాద్‌లోని ఒక బాలికల స్కూల్ వద్ద జరుగగా, ఒక బాలుడు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చుట్టుపక్కల వారు వచ్చి చూస్తుండగా రెండో బాంబు పేలుడు జరిగింది. కొద్ది వారాలుగా దేశంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల్లో వందలాది మంది పౌరులు, భద్రతా దళాల సిబ్బంది గాయపడ్డారు. అఫ్గాన్‌లో శాంతిచర్చలకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇవి విఘాతం కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో అమెరికా అధికారులు, తాలిబన్ ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం అనూహ్యంగా కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. తర్వాత రెండుదేశాల ప్రతినిధులు ఈనెలలో ఆ చర్చల కొనసాగింపులో భాగంగా సమావేశం కావాల్సి ఉంది. ఇలావుండగా తాము ఎట్టిపరిస్థితుల్లో అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చలు జరపమని, నేరుగా వాషింగ్టన్ ప్రతినిధులతోనే మాట్లాడతామని తాలిబన్‌లు చాలాకాలంగా స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో తిరిగి అశాంతి నెలకొనడంతో శాంతిచర్చలు, దేశంలో జరిగే ఎన్నికలపై అనుమానాలు కలుగుతున్నాయి.