జాతీయ వార్తలు

ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భారత్, ఇరాన్, ఆఫ్గానిస్తాన్ దేశాలు మంగళవారం కాబూల్‌లో సమావేశమై ఆర్థికాభివృద్ధి, సహకారం అంశంలపై కూలంకషంగా చర్చించాయి. ఇరాన్‌లో చాబహార్ రేవు, రోడ్ల అభివృద్ధితో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, ఇరానియన్ బృందం తరఫున ఉప విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాంగచి, ఆఫ్గానిస్తాన్ నుంచి ఉప విదేశాంగ శాఖ మంత్రి హెక్మత్ ఖలీల్ ఖర్జాయ్ పాల్గొన్నారు. ప్రధానంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, స్మగ్లర్లపై వేటు వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, పరస్పరం అభివృద్ధికి సహకరించుకోవాలని తీర్మానించినట్లు ఈ దేశాలు ప్రకటన విడుదల చేశాయి. వచ్చే ఏడాది భారత్‌లో మూడు దేశాలు సమావేశం కావాలని తీర్మానించారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పైన ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో చాబహార్ రేవు అభివృద్ధిపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఇరాన్‌లో సిస్టాన్ బెలూచిస్తాన్ రేవును భారత్ అభివృద్ధి చేసింది. ఈ ఆంక్షలను ఎదుర్కొనాలనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.
పాకిస్తాన్‌లో వాడర్‌పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి ధీటుగా మన పశ్చిమ తీరానికి అందుబాటులో ఉన్న ఇరాన్‌లోని చాబహార్‌ను అభివృద్ధి చేస్తే ఆఫ్గానిస్తాన్‌కు కూడా అందుబాటులోకి తెచ్చినట్లుంటుంది. పాక్‌లోని వాడర్ పోర్టుకు 80 కి.మీ దూరంలో చాబహార్ రేవు ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ రేవు మొదటి దశ నిర్మాణం పనులను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రారంభించారు. ఇండియా, ఆఫ్గనిస్తాన్, ఇరాన్‌లు ఈ రేవును సమిష్టిగా అభివృద్ధి చేసి ఉపయోగించుకోవాలని తీర్మానించాయి. ఈ దేశాల మధ్య ఈ రేవు అభివృద్ధిపై 2016లో ఒప్పందం కుదిరింది. ఈ రేవుఅభివృద్ధికి 85.21 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని భారత్ నిర్ణయించింది.