జాతీయ వార్తలు

ఆశ, అంగన్‌వాడీలకు గౌరవ వేతనం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలోని ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రధాని మోదీ వరాలు కురిపించారు. అక్టోబర్ నెల నుంచి వారి గౌరవవేతనం పెంచనున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించారు. గౌరవవేతనం పెంచడంతోపాటు సామాజిక భద్రత పథకాల కింద పలు సౌకర్యాలు ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు కల్పిస్తారు. ప్రధాన్ మంత్రి జవన్ యోజన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన కింద ఉచిత బీమా సదుపాయం కల్పిస్తారు. ఈ రెండు పథకాలకు సంబంధించి ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. ఆశ, అంగన్‌వాడీ వర్కర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వరాలు కురిపించారు. దురదృష్టకర పరిస్థితుల్లో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్త చనిపోతే 4 లక్షల రూపాయల ఉచిత బీమా ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎం(ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్)కు ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. సవరించిన వేతనాలు అక్టోబర్ నుంచి అమలవుతాయని, నవంబర్ నెల జీతంతో పెంచిన వేతనాలు ఇస్తారని ఆయన అన్నారు. కేంద్రం ప్రభుత్వ ప్రకటించిన ఈ పెంపును దీపావళి కానుకగా ప్రధాని చెప్పారు. ప్రస్తుతం నెలకు మూడువేల రూపాయల గౌరవవేతనం పొందుతున్న వారు నవంబర్ నుంచి 4,500 రూపాయలు ఇస్తారు. 2,200 తీసుకుంటున్న వారు 3,500 రూపాయలు అందుతాయి. అంగన్‌వాడీ సహాయకులకు 1,500 నుంచి 2,500 రూపాయలకు పెంచారు. ఆశ, అంగన్‌వాడీలకు గౌరవవేతనం పెంచడం సహజంగా జరిగేదే. ఈ పెంపుకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వేరుగా ప్రకటిస్తుంది. గర్భిణులు, చిన్నారుల పౌష్ఠికాహార పంపిణీ, పారిశుద్ధ కార్యక్రమాల అమలు, ఆరోగ్య భారత్‌లో ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ ప్రశంసించారు.