తెలంగాణ

100 సీట్లలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్,సెప్టెంబర్ 11:ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో తెలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి చేశారని, తెలంగాణ ఫలాలు తెలంగాణ వాసులకే దక్కుతున్నాయని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఖాయమని ప్రతి పక్షాలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వక తప్పదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు గెలుపొందారని తాగు సాగు నీరును ప్రజలుకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లి ప్రజల మధ్య తిరుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఇంకెవ్వరు అధికారంలో ఉన్నా రాష్ట్రం నష్ట పోతుందని ప్రజలే అంటున్నారని ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తామని అన్నారు. ఉమ్మడి నల్లగొండలో పనె్నండు సీట్లు టీఆర్‌ఎస్ గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్‌లో హేమాహేమీలుగా చెప్పుకుంటున్న వాళ్లు ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారని అన్నారు.తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, కర్రె వెంకటయ్య పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్