ఆంధ్రప్రదేశ్‌

ఈ గడ్డపై పుట్టినవారిగా మీకు బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిధులివ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే ఈ గడ్డపై పుట్టిన వారిగా మీకు అడిగే బాధ్యతలేదా అని బీజేపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలదీశారు. మంగళవారం శాసనసభలో రాజధాని అమరావతి నిర్మాణంపై లఘు చర్చ సందర్భంగా కేంద్రం వైఖరిని టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా నిరసించారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు, చాంద్‌బాషా, గొల్లపల్లి సూర్యారావు, వీరాంజనేయులు మాట్లాడుతూ గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, శివాజీ విగ్రహానికి 300 కోట్లు కేటాయించిన కేంద్రం రాజధాని నిర్మాణానికి మాత్రం 15 వందల కోట్లు విదిలించిందని ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సభ్యులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని పటేల్ విగ్రహానికి రూ 300 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్రం గుజరాత్‌కు ఎంతిచ్చిందో మనకు ఇచ్చిన హామీలేమిటో చెప్పమంటారా! అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసినప్పుడు ఈ గడ్డపై పుట్టిన వారిగా మీకూ బాధ్యత ఉంది కదా అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మీరు తలెత్తి చూడలేని విధంగా భవనాలు వెలుస్తాయని స్పష్టంచేశారు.
నేను బీజేపీలో ఉంటానో..లేదో..!
విష్ణుకుమార్‌రాజు
కేంద్రం నిధులు మంజూరు చేయకపోవటాన్ని ప్రశ్నిస్తూ తమ ప్రభుత్వం ప్రపంచ రాజధాని నిర్మాణాలు చేపట్టిందని ఆ ప్రగతి ఏమిటో మీరే చూస్తారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోపు నేను బీజేపీలో ఉంటానో..లేదో.. ఏ పార్టీలో ఉంటానో..ఎక్కడ ఉంటానో అని వ్యాఖ్యానించటం కొసమెరుపు. తాజ్‌మహల్ కట్టినట్లుగా రాజధాని నిర్మాణం చేపట్టారని రాజధానికి తగిన నిధులపై కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉందని సమర్థించారు. అయితే ఇప్పటి వరకు తమను ఈ విషయంలో ప్రభుత్వం భాగస్వాముల్ని చేయలేదని చెప్పారు.