ఆంధ్రప్రదేశ్‌

ఏసీ రూముల్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: రాజధానిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చుపెట్టారని ఆరోపిస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏసీ రూముల్లో కూర్చుని విమర్శలు చేయడం తగదని పురపాలకశాఖ మంత్రి నారాయణ ఖండించారు. మంగళవారం శాసనసభలో రాజధాని నిర్మాణంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలకు 2016 ఫిబ్రవరి 16వ తేదీన రూ 185 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. జీ ప్లస్ వన్ కింద రూ 2318 కోట్లతో ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్‌కు 2016 జూలై 14వ తేదీన టెండర్లు ఖరారయ్యాయన్నారు. మొత్తం 6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారని తెలిపారు. చదరపు అడుగుకు అయిన ఖర్చు రూ 2980 కాగా కార్యాలయాల్లో ఫర్నిచర్, ఇతర వసతులు , తుళ్లూరు నుంచి మంచినీటి పైపులైన్లు, రహదార్లతో కలుపుకుంటే ఎంతవుతుందని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మాస్టర్‌ప్లాన్‌లో 320 కిలోమీటర్ల ట్రంక్‌రోడ్డు నిర్మాణాలను 240 కిలోమీటర్ల రహదార్లకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని వివరించారు. కృష్ణానదిపై 9 ఐకానిక్ వంతెనల నిర్మాణంలో భాగంగా తొలిదశలో ఒక వంతెనకు రూ 11 వందల కోట్ల అంచనా సిద్ధం చేశామన్నారు. ఇవికాక అవుటర్, ఇన్నర్ రింగురోడ్లు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 5వేల 979 కోట్లతో 15 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని, మిగిలిన 14 గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందించామన్నారు. కొండవీటి వాగు, పాలవాగు ముంపు నియంత్రణకు నెదర్లాండ్స్‌కు చెందిన సంస్థతో పాటు టాటా కన్సల్టెంట్ గత వందేళ్ల వరద ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి డిజైన్లు రూపొందించిందని 16వేల క్యూసెక్కులు నీరు ప్రవహించే విధంగా ప్రతిపాదించిందని తెలిపారు. అయితే ప్రభుత్వం 21వేల క్యూసెక్కుల నీటిని నిల్వచేయాలని నిర్ణయించిందని రాజధాని నగరం వెలుపల, అంతర్గతంగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో రెండుకోట్ల పదిలక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. శాసనసభ డిజైన్లు ఖరారయ్యాయని నెలలోపు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. రూ 5676 కోట్లతో అసెంబ్లీ భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఎమ్మెల్యేలకు 288, ఐఏఎస్‌లకు 144, ఎన్జీవోలకు 134, ఇతరత్రా గృహనిర్మాణ సముదాయాలు ఇప్పటికే పూర్తి కావచ్చాయన్నారు. కేంద్రం పైసా ఇవ్వకపోయినా రాజధాని నిర్మాణంలో రాజీపడటంలేదన్నారు. రూ 48వేల కోట్లతో డీపీఆర్ ఇస్తే కేవలం 15 వందల కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్, హడ్కో, ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి రూ 29వేల కోట్లు రుణాలు సేకరిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన 16 వందల కోట్లకు యూసీలు సమర్పించామని నీతిఆయోగ్ సైతం రాజధానికి తక్షణం 666 కోట్లు విడుదల చేయాలని సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ప్రతిపక్షనేత డేటా తెలుసుకోకుండా కేవలం బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని అమరావతి వస్తే పరిస్థితి తెలుస్తుందని వ్యాఖ్యానించారు.