స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రులు శత్రువులవుతారు
సఖాయస్తే విషుణా అగ్న ఏతే శివాసః సంతో అశివా అభూవన్‌
అధూర్షత స్వయమేతే వచోభిరృజూయతే వృజినాని బ్రువంతః॥
భావం:- ఓ అగ్నీ! కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మమనే ఈ జ్ఞానేంద్రియాలు నీకు మిత్రులే. స్వభావంచేత అవి శుభదాయకమే అయినా ఏదేని సంసర్గ దోషంచేత ఏర్పడిన దోషంవలన విషమస్వభావం కలిగినవై అమంగళ ప్రదవౌతున్నాయి. అప్పుడవి సత్యశీలుడయిన వానిని దుర్భాషలు పలుకుతు తమనుతామే క్రూరంగా హింసించికొంటున్నాయి. అంటే పాపాన్ని మూటగట్టుకొంటున్నాయన్న మాట.
వివరణ:- మంత్రం పూర్వార్ధంలో లోకప్రసిద్ధ విషయాన్ని ఉపదేశిస్తూంది. మిత్రుడే అయితే అతడు తప్పక శుభదాయకుడే అవుతాడు. ఆపదలనుండి మరియు దుఃఖాల నుండి విముక్తికలిగించే వానినే మిత్రుడంటారు. మిత్రుని స్వభావమిదే. ఋగ్వేదం-
...‘సఖా సఖాయమతరద్ విషూచోః’॥
మిత్రుడు విషమ పరిస్థితులనుండి మిత్రుణ్ణి రక్షిస్తాడు అని ధృవపరచింది. ఋగ్వేదమే మరొక సందర్భంలో
సఖా సఖ్యుర్న ప్ర మినాతి సంగిరమ్‌॥
‘మిత్రుడు తన మిత్రుని మాటను భంగపరచడు’అని మిత్రుని ప్రాశస్త్యాన్ని కీర్తించింది. అంటె మిత్రుని మానమర్యాదలను మిత్రుడు భంగపరచక సంరక్షిస్తాడు అని భావం. కాని మిత్రుల మధ్యనుండే ఈ మృదుభావాలు కాలక్రమంలో అనేక కారణాంతరాలవలన క్షణమాత్ర కాలంలో చెడిపోయి ప్రాణమిత్రులు (శివాసః) కాస్త ఆగర్భశత్రువులు (అశివాః)గా మారిపోవచ్చు. శత్రుభావన ఏర్పడిన తరువాత వారిలో ఎవరు ఎవరిని మిత్రునిగా పూర్వంవలె భావిస్తారు?
ఇది బహిరంగంగా మిత్రుల మధ్య లోకంలో నడిచే వ్యవహారం. దీనిని ఆంతరమైన అంతరింద్రియాలకు సమన్వయించుకోండి. బహిరంగమైత్రి ఎలా ఏర్పడుతుంది? దీనిని గురించి నీతికారులు ‘సమానశీల వ్యసనేషు సఖ్యమ్’ సమాన స్వభావంకలవారి మధ్య సమాన కష్టాలననుభవించేవారి మధ్య మైత్రి ఏర్పడుతుందని చెబుతారు. వేద నిఘంటువైన నిరుక్తాన్ని వ్రాసిన నిరుక్తకారుడు సమాన స్వభావం లేదా చరిత్ర కలిగినవారి మధ్యనే సాధారణంగా స్నేహబంధమేర్పడుతుంది. ‘సమాన ఖ్యానో భవతి సఖ్యః’ అని నీతికారుల వచనానే్న సమర్థించాడు.
సాధారణంగా మనిషి తన ఆత్మను ఇంద్రియాలను ఒకటిగానే భావిస్తాడు. నా కళ్ళు అంటూ కూడ కంటికేర్పడిన దోషంవలన నేను అంధుణ్ణి లేదా ఏకాక్షిని అని అనుకొంటూ ఉంటారు. నిజానికి నేను నేను అని నిత్యమూ వ్యవహరించే ఆత్మ వేరు. ఇంద్రియమైన కన్ను వేరు. ఈ విషయాన్ని గ్రహించలేక నేనంధుణ్ణి అనుకొంటాడు మనిషి. కాని ఆత్మమాత్రం గ్రుడ్డిది కాదు. గ్రుడ్డితనం కంటిలో ఉంది గాని ఆత్మలో లేదు. మనిషి ఇంద్రియాలకుండే గుణదోషాలను ఆత్మకు చెందినవిగా భ్రాంతిపడతాడు. అయితే ఇంద్రియాలు మాత్రం ఆత్మకు విధేయంగా మిత్రులై వ్యవహరిస్తారు. వానికి అధిష్ఠానం శరీరం. ఆత్మకు నివాసమూ శరీరమే. అంటే ఆత్మకు ఇంద్రియాలు వానికధిష్ఠానమైన శరీరానికి చిరునామా ఒకటే. ఆ ఆత్మ-ఇంద్రియాల జ్ఞానం శరీరగతమై యుంటుంది. కాబట్టి అవి పరస్పరం మిత్రులు. ఇంద్రియాలు మిత్రులై ఆత్మకు కార్యసాధనలో సహాయకారులయితే అవి ఆత్మసాధకాలు కాగలవు. అలాకాక ఇంద్రియాలు ఆత్మకు విముఖంగా ఉంటే ‘శివాసః సంతో అశివా అభూవన్’అవి శివ (శుభ)ప్రదమైనవయినా అశివా (అశుభ)ప్రదమైనట్టివై ఆత్మపతనానికి హేతువులవుతాయి.
ఈ మంత్రం ద్వితీయార్థంలో మరో అద్భుత విషయం చెప్పబడింది. అదేమంటే మనుషులు పాపవశం వలన సత్యశీలుణ్ణి ఉద్దేశించి పాపపు మాటలనే (దుర్భాషల) పలుకుతూ తమనుతామే హింసించుకొంటున్నారు అని. అంటే పాపాలను మూటగట్టుకొంటున్నారు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు