Others

బురదబొమ్మ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె కళ్లల్లో ఒంటరి పక్షి వాలింది
చేతుల కొసలు నిర్మాణ కూలీలు
ఆమె ఊపిరి; బొమ్మ గుండెల్లో వొరిగింది
రెండు నేత్రాలు ఆల్చిప్పల్లా విచ్చుకున్నాయి
మూడో నేత్రంలో కోపం వర్షించింది
జనన మరణాలు ఒకే అడుగులో-
ఆమె కడుపు కోతకు గురైంది;
రక్తం బొట్లుబొట్లుగా ఉత్తరం వైపు...
అక్కడెవరో శిరస్సును కుట్టుతున్నారు
ప్రాణం సుడిగాలై లేస్తే సరిపోతుందా?
వెనె్నల పాలను కుమ్మరించాలి కదా!
చెడుకో మంచికో; భక్తి బజారులో..
రంగులపాములు శరీరాలపై
కాలుష్య సంతకాలు చేస్తుంటాయి;
వాసన వాసన వాసనలో భక్తి తేలింది
పచ్చని రెక్కలు వెక్కివెక్కి ఏడుస్తాయి...
అరచేతుల్లో బురద మరణించింది
నింగి, నీరు, గాలి, భూమి, ఆకాశం
ఏదైతేనేమి ప్రాణాలను విడువాల్సిందే
మనిషి ఊరేగుతున్నాడు మరి!

-అఖిలాశ 07259511956