వినమరుగైన

విషాద సారంగధర - ధర్మవరం కృష్ణమాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలపు తలపులధికమై, వరుసకు పుత్రుడైనా తన మోహాన్ని పలు రీతుల కోర్కెల తీర్చమని సారంగధరుని బతిమాలుతుంది. అతడంగీకరించకపోతే భగ్న ప్రేమికురాలై, వలపు పగయై కక్షగా మారుతుంది. రాజుకు చెప్పి శిక్ష విధించేలా చేస్తుంది. చివరికి తన తప్పిదాన్ని గుర్తించి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ పాత్ర క్రమోన్మీలనంలో ధర్మవరం సజీవ పాత్ర చిత్రణా నైపుణ్యం స్పష్టం.
సారంగధర పాత్ర సచ్ఛీలం. మంచితనమే రూపుధరించినట్లుండడం. పినతల్లి కోరిన పాపకార్యానికి లోనుగాకపోవడంవల్ల చేయని తప్పుకు శిక్ష ననుభవించి మరణించవలసి వచ్చింది. కరపాదచ్ఛేదనం జరిగినా పినతల్లిదే నేరమని చెప్పని ప్రగాఢ నిర్ణయం విశిష్టమైంది. అదే తనకు విపత్తుని తెచ్చిపెట్టింది. అయినా లెక్కచేయలేదు. అది సారంగధరుని గుణగరిష్ఠత; ఓ రకంగా ఇదే తప్పు!
ఇంక రత్నాంగి పాత్ర చిత్రణలో తగిన ప్రాముఖ్యం కనిపించడంలేదు. ఉత్తమ మిత్రుడు సుబుద్ధి సమయానికి పిచ్చివాడైపోవడంతో తెలిపిన సత్యాన్ని సాక్ష్యం చెప్పడానికి అవకాశం లేకపోయింది. ఇవన్నీ ఈ నాటక విషాదాంతతకు ఉపకరించాయని భావించడమే సముచితం.
నాటకంలోని సన్నివేశ కల్పనలో ధర్మవరంవారు అందెవేసిన చేయి. వారు పూర్వరంగం కల్పించారు. సంస్కృత నాటకాలకనుగుణంగా నాందీ ప్రస్తావనలో ప్రయుక్తం, పూర్వరంగ కల్పనం ద్వారా ఈ నాటకానికి ఫ్లాష్‌బ్యాక్‌లాగా విభావసుడనే బ్రాహ్మణుడు చిత్రాంగి చిత్రపటం తెస్తూ ఆవిడకు సారంగధరునిపైగల ప్రేమను వ్యక్తీకరించకపోవడం కథ ముందుకు నడవడానికి ఉపకరించింది. ఇలాంటి సన్నివేశాల మూలాన నాటకేతివృత్తం క్రమోన్మీలనం చెంది నాటకీయ శిల్పానికి సహకరించింది.
నాటకకర్తకుండవలసిన లక్షణాలన్నీ వారి విషాద సారంగధరలో చూడగలం. ఇతివృత్త నిర్వహణ, సజీవపాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణా చాతుర్యం రసౌచితీసహిత రచన మొదలైన గుణాలన్నీ ఒనగూడినట్లు గమనించాము. విషాద సారంగధర నాటకాన్ని గూర్చిన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి నిర్ణయమది. ‘‘అందలి పాత్ర పోషణము, సల్లాపకౌశలము, సంవిధాన చాతుర్యము-ఇత్యాదులను బట్టి చూచినచో వారి నాటకములలోకెల్ల నిది యుత్తమమనక తప్పదు. ఇంతేగాదు తెలుగు భాషయందలి యుత్తమ రూపకములలో కొన్నింటిలో నిదియొకటి యనుట నిస్సందేహము.
-అయపోయంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఆచార్య ఎస్.గంగప్ప