నెలాఖరున ‘ఆపరేషన్ 2019’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్ 2019’. బివేర్ ఆఫ్ పబ్లిక్... అనేది ఉప శీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్, సునీల్ ‘కీ రోల్స్’చేస్తున్నారు. ఈనెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్ పూర్తికాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఓ పాటను సునీల్‌పై తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా లొకేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో.. శ్రీకాంత్ మాట్లాడుతూ.. కరణం బాబ్జి దర్శకత్వంలో ‘మెంటల్ పోలీస్’అనే సినిమా చేశా. రాజకీయ నేపథ్యంలో తాజా ‘ఆపరేషన్ 2019’ అనే సినిమా చేస్తున్నా. ఈనెలాఖరున సినిమా విడుదల కానుంది. చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ‘ఆపరేషన్ దుర్యోధన’ తర్వాత మళ్లీ ఒక గెటప్‌తో కొత్త సినిమా చేశాననే ఫీలింగ్ కలిగింది. ప్రేక్షకులు ఆలోచించే విధంగా కరణం బాబ్జి డైలాగులను బాగా రాశాడు. నిర్మాతల సహకారంతో అనుకున్న విధంగా చిత్రీకరణ జరిగంది. ఇందులో మంచు మనోజ్, సునీల్‌గారితో స్క్రీన్ షేర్‌చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సునీల్‌తో నా కాంబినేషన్‌లో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో మా కాంబినేషన్ వస్తుంది. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రజలు ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది చూస్తారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగా ఉంటుందని అనుకుంటున్నా’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ అన్నయ్య నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ నా ఫేవరేట్ సినిమా. ఇప్పుడు ‘ఆపరేషన్ 2019’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటించడం నాకిష్టమన్నారు.