అదిగో అదిగదిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పంది పిల్లను లీడ్ రోల్‌గా చేసుకొని సబ్జెక్ట్‌ను క్రియేట్ చేసిన క్రేజీ డైరెక్టర్ రవిబాబు తాజా చిత్రం ‘అదిగో’. రెండున్నర సంవత్సరాల క్రితం మొదలైన ఈ చిత్రం ట్రైలర్ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ విడుదల అనంతరం రవిబాబు మాట్లాడుతూ.. పంది పిల్లతో సినిమానా...? ఫైనాన్షియల్ ప్రోబ్లెమ్స్‌లో ఉన్నావా..? మానసిక పరిస్థితి బాగానే ఉందా...? ముస్లిమ్స్ ఇలాంటి సినిమాను చూస్తారా అంటూ ఎన్నో కాన్వాగేషన్స్ మధ్య సినిమా మొదలయ్యింది. ఈ సినిమా రెండున్నర ఏళ్ళుక్రితం మొదలుఅయ్యింది. 3డి పంది పిల్లను రియల్ పంది పిల్లగా కనె్వర్ట్‌చేయడానికి ఇంత టైంపట్టింది. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ప్రశాంత్‌వర్మ డెబ్యూ మూవీ. కానీ అదిగో ఆలస్యం అవడంతో తనకు ఇది 5 సినిమా అయ్యింది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఆడియోతో ముందుకు వస్తామని తెలిపారు. నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో యానిమల్స్‌తో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. తమిళంలో కూడా విడుదలవుతోంది ఈ చిత్రం. అక్కడి నిర్మాత అడిగాడు ఇన్ని జంతువులు ఉండగా ఎందుకు పంది పిల్లనే పెట్టి తీస్తున్నారు. అయినా ఎగ్జైటిమెంట్‌తో ఉన్నాను అని చెప్పాడు. ఈ సినిమాలో 3డి పంది పిల్లను చూస్తున్నామా.. లేక రియల్ పంది పిల్లను చూస్తున్నామా అనేలా న్యాచురల్ లైవ్ ఇవ్వడంకోసం ట్రై చేసాము. ఈ సినిమా చేయడానికి రవికి ఉన్న ఓపికను చూసి మెచ్చుకోవాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో లవ్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ అదిగో. పిల్లలకు బాగానచ్చుతుంది. సినిమాను సమ్మర్‌కు విడుదల చేస్తామని చెప్పారు.