రాశిఫలం -- 13-9-2018

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ చవితి సా.5.23 -- కలియుగం - 5120, శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
స్వాతి రా.తె.4.17
వర్జ్యం: 
ఉ.9.53 నుండి 11.28 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.10.00 నుండి 10.48 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
మ.1.30 నుండి 3.00 వరకు -- విశేషాలు: వినాయక చవితి
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
Date: 
Thursday, September 13, 2018