క్రైమ్/లీగల్

పలాస సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, సెప్టెంబర్ 12: పలాస సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కార్యాలయం రద్దీగా ఉన్న సమయంలో ఏసీబీ డి ఎస్పీ కె.రాజేంద్ర బృందం చేరుకుంది. అనంతరం తాము ఏసీబీ అధికారులమని, మొత్తం రికార్డులు తనిఖీ చేయడంతోపాటు దర్యాప్తుకు సహకరించాలని సబ్‌రిజిస్ట్రర్ రాజుకు కోరగా, ఎక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌లను నిలుపుదల చేసి కార్యాలయాన్ని ఏసీబీ అధికారులకు అప్పగించారు. ముందుగా రిజిస్ట్రర్ రూమ్‌లో సోదాలు చేయగా, 90,400 రూపాయలు నగదు లభ్యమైందని, దీనికి సంబంధించిన రికార్డులు చూపించాలని సబ్‌రిజిస్ట్రర్ సిబ్బందికి రికార్డులు చూపించాలని కోరగా, రికార్డులు లేవని సిబ్బంది తెలిపారు. ఆ నగదును సీజ్ చేస్తున్నట్లు డి ఎస్పీ వెల్లడించారు. అనంతరం మొత్తం రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి రికార్డులు, కంప్యూటర్లును సాయంత్రం వరకు తనిఖీలు చేస్తూ, రిజిస్ట్రేషన్‌లకు, నగదుకు పొంతన లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేసారు. రికార్డులు సక్రమంగా లేవని, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
డి ఎస్పీ పేరు చెప్పి బెదిరింపులు
ఏసీబీ డి ఎస్పీ కె.రాజేంద్ర పేరుతో ప్రస్తుతం కాశీబుగ్గలో పనిచేస్తున్న క్లర్క్ ఉమామహేశ్వరరావుకు బెదిరింపులకు పాల్పడుతున్న సమాచారం రావడంతో ఆయనపై శాఖాపరంగా దర్యాప్తు నిర్వహించారు. సంబంధిత ఎస్ ఎం ఎస్‌లపై డి ఎస్పీ మండిపడ్డారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చినా సంతృప్తి చెందలేదు. ఆయన నరసన్నపేట, పలాస ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రర్లుగా పనిచేస్తున్నకాలంలో జరిగిన లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. కాశీబుగ్గలో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి గోల్డెన్‌ల్యాండ్ భూముల రిజిస్ట్రేషన్‌లపై కూడ అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పష్టత ఉంది, కనుక రిజిస్ట్రేషన్‌లు చేసామని రిజిస్ట్రర్ రాజు డి ఎస్పీకి తెలిపారు. మొత్తం ఉమామహేశ్వరరావు వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించారు. రిజిస్ట్రర్ కార్యాలయంలో ఏ విధమైన అవినీతి జరుగుతుందో, ఎంత మేరకు ఆదాయం వస్తుందో తమ వద్ద వివరాలు ఉన్నాయని డి ఎస్పీ అన్నారు. ఇదిలావుండగా డి ఎస్పీ సమక్షంలోనే జిల్లా రిజిస్ట్రర్ జానకిదేవి, కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రర్ రాజు వాగ్వివాదం పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సిబ్బంది లేకనే కొన్ని మార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని రిజిస్ట్రర్ రాజు చెప్పగా, ఇది సరైన పద్దతి కాదని, తగినంత సిబ్బంది ఉన్నారని, అవసరమైతే సబ్‌రిజిస్ట్రర్ సిబ్బంది అవతారమెత్తాలని జిల్లా రిజిస్ట్రర్ ఆయనను మందలించారు. సాక్షాత్తూ ఏసీబీ అధికారుల సమక్షంలో అధికారులు వాగ్వివాదం పడడంతో వారంతా అసహనానికి గురైనారు. ఇదిలావుండగా కాశీబుగ్గకు చెందిన నలుగురు డ్యాకుమెంటరీ రైటర్లును కూడ కార్యాలయానికి రప్పించి వారి వద్ద లిఖితపూర్వకంగా వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై డి ఎస్పీ రాజేంద్ర మాట్లాడుతూ మొత్తం 90 వేల 400 రూపాయలు సీజ్ చేసామని, ఇక్కడ జరిగిన వ్యవహరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ సీ ఐ శ్రీనివాసరావు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.