బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వరుసగా రెండు రోజుల పాటు పతనమయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి బలపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యంతో రూపాయి కోలుకున్న తరుణంలో మదుపరులు ఇటీవల ధరలు పడిపోయిన ఎఫ్‌ఎంసీజీ, లోహ, క్యాపిటల్ గూడ్స్ షేర్లను విరివిగా కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ కీలక సూచీలు బలంగా పుంజుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతంలో దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తారని వార్తలు రావడంతో పాటు రూపాయి మారకం విలువ అనుచిత స్థాయికి పతనం కాకుండా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వం ప్రకటించిన తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. బుధవారం సానుకూల స్థాయి వద్ద ప్రారంభమయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మధ్యాహ్నం తరువాత జరిగిన లావాదేవీలలో బాగా పుంజుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 304.83 పాయింట్ల ఎగువన 37,717.96 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 82.40 పాయింట్లు పెరిగి, 11,369.90 పాయింట్ల వద్ద ముగిసింది. బుధవారం ఇంట్రా-డేలో చరిత్రలో మొదటిసారి డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయి 72.91 స్థాయికి పతనమయింది. అయితే, మధ్యాహ్నం తరువాత జరిగిన లావాదేవీలలో రూపాయి విలువ 71.86 స్థాయికి తిరిగి పుంజుకుంది. దేశ ఎగుమతులు ఆగస్టు నెలలో 19.21 శాతం పెరిగి, 27.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. బుధవారం సానుకూల స్థాయి 37,546.42 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత మరింత పైకి ఎగబాకుతూ 37,752.58 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు), రిటెయిల్ ఇనె్వస్టర్లు భారీగా కొనుగోళ్లు జరపడంతో ఈ సూచీ పుంజుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 304.83 పాయింట్ల (0.81 శాతం) ఎగువన 37,717.96 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఒక దశలో ఈ సూచీ ప్రతికూల జోన్‌లోకి వెళ్లిపోయి 37,342 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. క్రితం రెండు సెషన్లలో కలిసి ఈ సూచీ 977 పాయింట్లు పడిపోయింది. బుధవారం అనిశ్చితితో కూడిన లావాదేవీల మధ్య ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తిరిగి కీలకమయిన 11,300 మార్కుకు పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 82.40 పాయింట్ల (0.73 శాతం) ఎగువన 11,369.90 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ గరిష్ఠ స్థాయి 11,380.75, కనిష్ట స్థాయి 11,250.20 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, డీఐఐలు మంగళవారం నికరంగా రూ. 749.62 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,454.36 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ఇదిలా ఉండగా, వినాయక చవితిని పురస్కరించుకొని దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు ప్రకటించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో పవర్‌గ్రిడ్ షేర్ విలువ బుధవారం 3.40 శాతం పెరిగింది. ఐటీసీ లిమిటెడ్ షేర్ ధర 3.11 శాతం పుంజుకుంది. లాభపడిన ఇతర సంస్థల్లో సన్ ఫార్మా, అదాని పోర్ట్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, వేదాంత లిమిటెడ్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, విప్రో, రిల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.98 శాతం వరకు పెరిగింది. ఇందుకు భిన్నంగా యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 2.30 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ అత్యధికంగా 2.40 శాతం పుంజుకుంది.