క్రైమ్/లీగల్

ఓడలరేవులో ఓఎన్‌జీసీ పైపు లైను నుండి క్రూడాయిల్ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, సెప్టెంబర్ 12: అల్లవరం మండలం ఓడలరేవులో ప్రధాన పైపులైకు రంద్రం చేసి లక్షలు విలువైను క్రూడాయిల్ చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజులుగా సాగుతున్న ఈ దందాలో వేలాది లీటర్లు కుడ్రాయిల్‌ను ట్యాంకర్లు ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికుల, ఓఎన్‌జీసీ అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం ఓడలరేవు టెర్మినల్ నుండి ఉప్పలగుప్తం మండలం రవ్వ ప్లాంట్‌కు పైపులైన్ ద్వారా ప్రతి రోజు వేలాది లీటర్లు క్రూడాయిల్‌ను తరలిస్తారు. ఓడలరేవు ఓఎన్‌జీసీ టెర్మినల్‌లో ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌ను అధిక ఒత్తిడి గల ఈ పైపులైను ద్వారా ఎస్ యానం రవ్వ ప్లాంట్‌కు నిర్ణీత సమయాల్లో తరలిస్తుంటారు. ఈ విధానాన్ని చోరీదారులు అనుకూలంగా మలుచుకుని ప్రధాన పైపులైనకు కన్నంపెట్టారు. ఓడలరేవు ఓఎన్‌జీసీకి కూత వేటు దూరంలో బీవీసీ రోడ్డులో జీడిమామాడి తోటలను చోరీ కేంద్రంగా చేసుకున్నారు. మూడు మీటర్లు లోతున ఏర్పాటు చేసిన అధిక ఒత్తిడి గల మెయిన్ పైపులైనుకు రంద్రం చేసి అంగుళం మందం గల ఇనుప పైపు ద్వారా కనెక్షన్ ఏర్పాటు చేశారు. దీనికి 4 అంగుళాలు వెడల్పున పీవీసీ పైపులను జతచేసి దానికి 100 మీటర్లు పోడవునా కానా పైపు ద్వారా 5 వేల లీటర్లు కెపాసిటీ గల సిన్‌టెక్స్ ట్యాంకులకు కనెక్షన్ ఇచ్చారు. ప్రతీ రోజు నిర్ణీత సమయంలో పైపు ద్వారా తరలించే క్రూడాయిల్ చోరీదారులు ఏర్పాటు చేసుకున్న స్టోరేజ్ ట్యాంకు వచ్చి చేరుతుంది. ట్యాంకులోకి వచ్చి చేరిన క్రూడాయిల్‌ను రాత్రి వేళల్లో ట్యాంకర్లు ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల రోజులుగా సాగుతున్న దందాలో ప్రతీ రోజు 5 వేల లీటర్లకు పైగా క్రూడాయిల్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. దీని విలువ ఒక రోజుకి అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 1.50 లక్షలు ఉంటుందని అంచనా. నెల రోజులుగా సాగుతున్న దందాలో సుమారు రూ. 54 లక్షలు ఉండవచ్చని ఓఎస్‌జీసీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఓఎన్‌జీసీ టెర్మినల్ పాయింట్‌కు కూత వేటు దూరంలో చోరీ జరుగుతున్నా అధికారులు కానరాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ దందాలో స్థానికుల హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు. ముడి చమురు చోరికి గురవుతుందని గుర్తించిన ఓఎన్‌జీసీ అధికారులు, ఎస్‌పీఎస్ పోవలీసులు జీడీమామాడి తోటల్లో ఆనుమానాస్పద ప్రదేశాన్ని గుర్తించి ఓఎన్‌జీసీ విజిలెన్సు అధికారులకు సమాచారం అందించారు. దీనితో విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అనుమానాస్పద ప్రదేశాన్ని పరిశీలించి క్రూడాయిల్ చోరీ జరుగుతున్నట్లుగా గుర్తించారు. అయితే చోరీ ఎవరు చేస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది తెలియవలసి ఉంది.