క్రైమ్/లీగల్

ఎన్‌ఆర్‌ఐ కిడ్నాప్‌ను ఏడు గంటల్లో ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 12: ఎన్‌ఆర్‌ఐ కిడ్నాప్‌ని రేణిగుంట అర్బన్ పోలీసులు ఏడు గంటల్లో ఛేదించి నాటకీయ పరిణామల మధ్య కిడ్నాపర్ స్నేహితులైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే తిరుపతి భవానీనగర్‌కు చెందిన ఖాదర్ బాషా అనే ఎన్‌ఆర్‌ఐ రేణిగుంట సీబీ ఐడీ కాలనీలోని తన స్నేహితులను కలిసేందుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా గూడ్స్ షెడ్ వద్ద ఉన్న చీకటి ముళ్ల పొదల రోడ్డులో గుర్తు తెలియని దుండగులు ఖాదర్ బాషా, అతని స్నేహితులు కళ్లల్లో కారం చల్లి వారు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి దగ్ధం చేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగిన విషయం విదితమే. ఆ సమయంలో ఖాదర్ బాషాను కిడ్నాపర్లు తమ కారులో బలవంతంగా కిడ్నాప్ చేశారు. దీంతో క్షణాల వ్యవధిలో ప్రచార మాధ్యమాల్లో ఎన్‌ఆర్‌ఐ కిడ్నాప్ అయిన విషయం ప్రసారమైంది. దీంతో అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐ నాగరాజు కిడ్నాప్ అయిన ఖాదర్ బాషాకు సంబంధించిన సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆప్రాంతంలో వెతకడంతో ఖాదర్ బాషాను గుర్తించారు. దీంతో పోలీసులు ఖాదర్ బాషాను విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు 8మంది కారులో తీసుకువెళ్లి కరకంబాడి వద్ద కారు ఆపారన్నారు. కిడ్నాపర్లకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో వారి సూచనల మేరకు 10 రోజుల్లో రూ. 10 లక్షలు తెచ్చిస్తే ప్రాణాలతో వదులుతామని, లేకుంటే అంతం చేస్తామని హెచ్చరించి అక్కడే వదిలి వెళ్లారన్నారు. తాను దీనిపై ఫిర్యాదు చేయనని, కేసులు వద్దని పోలీసులకు తెలిపాడు. అంతకుముందుగా ఖాదర్ బాషా స్నేహితులైన తిరుపతికి చెందిన వంశీ, శివ అనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో పక్క ఖాదర్ బాషా వద్ద ఉన్న స్నేహితులు శశికాంత్, సుధాకర్‌లను పోలీసులు ద్విచక్రవాహనాన్ని దగ్ధం చేసిందెవరని విచారణ కొనసాగిస్తున్నారు. వంశీ, శివ తమకు ఉద్యోగాలిప్పిస్తానని రూ. 5లక్షలు తీసుకున్నాడని పోలీసులకు చెప్పారు. పోలీసులు మాత్రం ఖాదర్ బాషా సెల్ ఫోన్‌కు గత మూడు రోజులుగా ఎవరెవరు ఫోన్‌లు చేశారన్న కాల్ రికార్డ్స్‌ను పరిశీలించి కిడ్నాప్ వ్యవహారం నిజమా... లేకుంటే నాటకమా అనేది తేల్చనున్నారు. మరోపక్క ప్రేమ వ్యవహారమే ఖాదర్ బాషా కిడ్నాప్‌కు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖాదర్ బాషా స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.