శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, సెప్టెంబర్ 12 : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నెల్లూరు అర్డీఓ చిన్నికృష్ణ తెలిపారు. మనుబోలు రైతులు అండర్‌బ్రిడ్జి (డొంక మార్గం) ఏర్పాటు చేయాలని కోరడంతో అందుకు అవసరమైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. దీంతోపాటు కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న షాపుల యజమానులు ఈ ప్రదేశంలో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పరిశీలించారు. అనంతరం ఆయన తహశీల్దార్ కార్యాలయం చేరుకుని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సీజేఎఫ్‌ఎస్ పట్టాలకు సంబంధించి డీకేటీ పట్టాలు ఇవ్వడానికి అన్ని మండల స్థాయిలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. మండలం నుంచి వచ్చిన రికార్డులను మరోసారి ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించిన తర్వాత తర్వాత కలెక్టర్‌కు పంపుతామని తెలిపారు. మనుబోలు నుంచి జాతీయరహదారి కలిసే ప్రదేశంలో అండర్ వంతెన (డొంక మార్గం) ఏర్పాటుకు సంబంధించి తహశీల్దార్ లీలారాణి రిపోర్టు ఇచ్చారని, ఈ మార్గం ఏర్పాటు చేయడానికి హైవే అధికారులను పిలిచి మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ సమయంలో రైతులు ఆర్డీఓ చిన్నికృష్ణతో మాట్లాడుతూ గ్రామం నుంచి సుమారు రెండువేల పశువులు రోడ్డు దాటి పొలాలకు వెళ్లాల్సి వస్తుందని, రోడ్డు దాటించే సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి దాటించాల్సి వస్తుందని తెలిపారు. వీలైనంత త్వరగా డొంక మార్గం ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట స్థానిక తహశీల్దార్ లీలారాణి, విఆర్‌ఓలు నాగార్జునరెడ్డి, శ్రీనివాసులునాయుడు తదితరులు ఉన్నారు.