ప్రకాశం

మార్కాపురం వైకాపా టిక్కెట్ రేసులో బట్టగిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 12:జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ టిక్కెట్ రేసులో ప్రముఖ బిల్డర్ బట్టగిరి వెంకట సుబ్బారెడ్డి ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఆమేరకు ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలిసింది. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి వైసిపి టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన గుంటూరులో జిల్లాలో ప్రముఖ బిల్డర్‌గా ఉంటూ వైకాపా అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఆర్ధికంగా బలోపేతంగాను, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో ఆయనకు బంధుత్వం ఉండటంతో ఆయనకు కలిసివచ్చే అంశాలని పార్టీశ్రేణులు చెబుతున్నాయి.
ఇదిలాఉండగా సిట్టింగ్ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి ఆర్ధికంగా బలోపేతం కాకపోవటంతో ఆయన స్ధానంలో బట్టగిరిని రంగంలోకి దించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలు వైసిపికి అత్యంత ప్రతిష్టాత్మాకం కావటంతో ఆర్ధికంగా బలోపేతమైన నాయకులను రాష్టప్రార్టీ ఎంపిక చేయనుంది. ఈనేపధ్యంలో ఆయనకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ను కేటాయిస్తారా లేదా అనేది వేచిచూడాల్సిఉంది.
ఇదిలాఉండగా గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయమార్పులు జరుగుతాయా లేక ప్రస్తుత ఇన్‌చార్జీనే కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జీగా ప్రస్తుతం ఐవి రెడ్డి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా టిక్కెట్ రేసులో మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డి, మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు కూడా వైకాపా నుంచి గిద్దలూరు నియోజకవర్గంనుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండటంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ దక్కనుందని విశే్లషణ అదేవిధంగా ఇదిలాఉండగా కనిగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ వర్గానికి కాదని యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్‌కు వైసిపి టిక్కెట్‌ను గతంలో కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. కాగా రానున్న ఎన్నికల్లోనూ బుర్రాకే టిక్కెట్‌ను రాష్టప్రార్టీ ఇవ్వనున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఈనేపధ్యంలో కనిగిరి నియోజకవర్గంలో చేసిన ఘోర తప్పిదాన్ని గిద్దలూరు నియోజకవర్గంలో చేయకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంలో రాష్టప్రార్టీ ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. మొత్తంమీద మార్కాపురం నియోజకవర్గ వైసిపి టిక్కెట్ రేసులో బట్టగిరి వెంకటసుబ్బారెడ్డి రేసులో ఉండగా గిద్దలూరు నియోజకవర్గంలో మాత్రం ఐవిరెడ్డి, సాయికల్పనారెడ్డి రేసులో ఉన్నారని తెలిసింది.