ప్రకాశం

బొజ్జ గణపయ్యా.. పూజలందుకోవయ్యా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 12:వినాయక చవితి పండగను అంగరంగ వైభవంగా చేసుకునేందుకు జిల్లాప్రజానీకం సిద్ధమైంది. వినాయక చవితి పండగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుండి ప్లాస్టర్ ఆఫ్‌పారిస్‌తో చేసిన వినాయక విగ్రహాలు, మట్టివినాయక విగ్రహాలు కొనుగోలు చేసేపనిలో ప్రజలు నిమగ్నమై ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసంవత్సరం మట్టివినాయక విగ్రహాల ఏర్పాటుపై జిల్లా ప్రజలు ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. ఈ పాటికే పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి వినాయక విగ్రహాలను వాడండి పర్యావరణాన్ని కాపాడాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు ప్రజాప్రతినిధులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేలాది రూపాయలను వెచ్చించి ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తోచేసిన వినాయక విగ్రహాలను భక్తులు కొనుగోలు చేసి ప్రత్యేకమైన వాహనాల్లో తమ గ్రామాలు, పట్టణాలు, నగరాలకు తరలించారు. ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా పత్రి విక్రయాలు జోరుగా సాగాయి. బుధవారం సాయంత్రంనుండి గురువారం ఉదయం వరకు పత్రి విక్రయా లు నిర్వాహకులు చేపట్టి వేలాదిరూపాయలను సంపాదించుకున్నారు. వినాయక చవితి వచ్చిందంటే ముందుగా పత్రి విక్రయదారులు, వినాయక విగ్రహాలు తయారుచేసేవారికి కాసులే వర్షమే. పత్రిలో 21రకాలను వాడతారు. జిల్లాకేంద్రమైన ఒంగోలు, చీరాల,మార్కాపురం, కందుకూరు, అద్దంకి,కనిగిరి తదితర పట్టణాలకు ఆయా చుట్టుపక్కలగ్రామాలనుండి విక్రయదారులు తీసుకువచ్చి విక్రయించటం జరుగుతుంది.
కాగా వినాయక చవితి సందర్బంగా వినాయక విగ్రహాలను ఏర్పాటుచేయాలంటే ముందుగా పోలీసు శాఖాధికారుల అనుమతి తీసుకోవాల్సిఉంది. అదేవిధంగా విగ్రహాలకు విద్యుత్ సౌకర్యం కావాలంటే విద్యుత్ శాఖాధికారుల అనుమతి తప్పనిసరిగా ట్రాన్స్‌కో అధికారులు చేశారు. విద్యుత్ శాఖాధికారుల అనుమతులు లేకుండా మాత్రం విగ్రహాలను ఏర్పాటుచేస్తే అలాంటివారిపై కఠిన చర్యలను విద్యుత్ శాఖాధికారులు తీసుకోనున్నారు. అదేవిధంగా పోలీసు శాఖాధికారులు కూడా ప్రత్యేక నియమనిబంధనలను విధించారు. వినాయక చవితి సందర్బంగా వినాయక విగ్రహాల ఎదుట భారీ ఎత్తున మైక్‌సౌండ్‌లతోపాటు, ఆశ్లీల నృత్యాలు లేకుండా చర్యలు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. విగ్రహాలను ఏర్పాటుచేసే నిర్వాహకులు విధిగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాల్సిఉంది. ఊరేగింపు సమయాల్లో డిజె సౌండ్స్‌కు అనుమతిని పోలీసులు నిరాకరించారు. అదేవిధంగాగణేష్ విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేసే సమయంలోను భక్తులు విధిగా మద్యంసేవించి ఊరేగింపులో పాల్గొనేందుకు వీలులేకుండా పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కాగా వినాయక చవితి సందర్బంగా భక్తులు కొత్త బట్టలను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. వినాయక చవితి పండగ సందర్భంగా అత్యంత భక్తిప్రపత్తులతో జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సమాయత్తమైంది.